జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఉగ్ర దాడుల తర్వాత దేశంలో పలు ప్రాంతాల్లో విదేశీయులపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్యకాలంలో ఉగ్రవాద కదలికలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎవరు ఊహించని విధంగా ఉత్తరాంధ్రలోని విజయనగరంలో.. ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారం.. ఆ తర్వాత జరిగిన అరెస్టులు పలు పరిణామాలు కంగారుపెట్టాయి. ఇక విజయవాడ నగరంలో కూడా ఉగ్రవాదులు పాగా వేశారు అనే ప్రచారం సైతం జరిగింది.
Also Read : మాకేం పాపం తెలీదు.. లిక్కర్ పాపం వారిదే..?
ఇటీవల విజయవాడలోని వన్ టౌన్ పరిసర ప్రాంతాలు, మెకానిక్ షాపుల వద్ద పనిచేసే వ్యక్తులు కొందరు ఉగ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారనే ప్రచారం జరిగింది. దీనిపై పోలీసులు అప్రమత్తమై ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నారు. ఇక తాజాగా విజయవాడలో విదేశీయుల కలకలం ఆందోళన కలిగించింది. మయన్మార్, బంగ్లాదేశ్ దేశాలకు చెందిన 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాడిగడప మున్సిపాలిటీ పరిధిలో వీరు నివాసం ఉంటున్నారని గుర్తించిన పోలీసులు.. సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
Also Read : తండ్రికి ఉన్న దమ్ము లేదా..? అంత భయమెందుకు జగన్..?
వారిని పోలీస్ స్టేషన్ లకు తరలించి విచారణ కూడా జరిపారు. ఇతర దేశాలకు చెందిన వారిని వెంటనే నగరం ఖాళీ చేసి తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. అసలు వీరికి ఆశ్రయం కల్పించింది ఎవరు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కానూరు సమీపంలో ఉండే సనత్ నగర్ లో.. ముస్లింలు ఎక్కువగా నివాసం ఉంటారు. వారి మధ్యనే వీరు స్థానికుల్లా చలామణి అవుతున్నారని పోలీసులు సమాచారం అందుకుని దాడులు చేపట్టారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు బయటకు రావడంతో ఒక్కసారిగా విజయవాడ నగరం ఉలిక్కిపడింది.