Friday, September 12, 2025 03:29 PM
Friday, September 12, 2025 03:29 PM
roots

పాస్టర్ ప్రవీణ్ కేసు.. ఏపీ పోలీసుల తీరుపై ప్రసంశలు

గత వారం రోజుల నుంచి సంచలనంగా మారిన పాస్టర్ ప్రవీణ్ పగడాల వ్యవహారంలో ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుపై ప్రసంశలు వ్యక్తమవుతున్నాయి. అతని వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి పోలీసులపైనే విమర్శలు పెద్ద ఎత్తున వచ్చాయి. పోస్ట్ మార్టం జరిగే సమయంలో కూడా పోలీసులనే టార్గెట్ చేసి నిరసన కార్యక్రమాలు చేసారు కొందరు. ఇక సోషల్ మీడియాలో కూడా పోలీసుల సమర్ధతపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అయినా సరే పోలీసులు ఎక్కడా సంయమనం కోల్పోలేదు.

Also Read : ఎమ్మెల్సీ దువ్వాడ.. డాక్టరేట్‌లో నిజమెంత?

ప్రవీణ్ పగడాల కేసు విషయంలో కొన్ని సంఘాలు నుంచి విపరీతమైన ఒత్తిడి వచ్చినా సరే పోలీసులు సాక్ష్యాలు చేతికి వచ్చే వరకు ఎక్కడా మాట్లాడలేదు. కొన్ని వర్గాలు రెచ్చగొడుతున్నా సరే ఎక్కడా బాలన్స్ తప్పకుండా సమాధానం ఇచ్చారు. ముఖ్యంగా రాజమండ్రి ఎస్పీ ఈ కేసు విషయంలో ఎంతో హుందాగా వ్యవహరించారు. అలాగే ఐజీ కూడా ఎక్కడా తొందరపాటు వ్యాఖ్యలు చేయలేదు. సున్నితమైన విషయం కూడా కావడంతో సాక్ష్యాలు చేతికి వచ్చే వరకు మాట్లాడలేదు.

Also Read : అప్పుడైతే అలా.. మరి ఇప్పుడో..!

అనుమానస్పద మరణంగా కేసు నమోదు చేయాలని డిమాండ్ వచ్చిన వెంటనే.. డిమాండ్ కు తగ్గట్టు కేసు ఫైల్ చేసారు. పోస్ట్ మార్టం వీడియో రికార్డ్ కూడా చేయించారు పోలీసులు. రోడ్డు ప్రమాదాన్ని.. కొన్ని వర్గాలు కుట్రగా చూపించే ప్రయత్నం చేసినా.. అటు తెలంగాణా పోలీసులు, టోల్ గెట్ సంస్థలు, వైన్ షాపులు సహా.. పలువురి సహకారంతో కేసుకి వేగంగా ముగింపు ఇచ్చారు. అటు సోషల్ మీడియాలో కూడా కొందరు పోలీసులపై కాస్త దురుసుగా మాట్లాడినా.. కేసు తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా వ్యవహరించారు. ఇక ప్రభుత్వ పెద్దలు సైతం ఈ విషయంలో ఎక్కడా తొందరపడి మాట్లాడకపోవడం గమనార్హం.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

ఇదేంది కేటిఆర్..? ఆ...

వాస్తవానికి రాజకీయాలను అంచనా వేయడం చాలా...

పోల్స్