Friday, September 12, 2025 07:28 PM
Friday, September 12, 2025 07:28 PM
roots

రూటు మార్చిన ఏపీ పోలీసులు..!

ఆంధ్రప్రదేశ్ లో పోలీస్ శాఖ రూటు మార్చిందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. ఇన్నాళ్లు కేసులు విషయంలో చూసి చూడనట్టు వ్యవహరించిన పోలీసు అధికారులు.. ఇప్పుడు కాస్త దూకుడు పెంచారు. వైసీపీ బెదిరింపుల విషయంలో వెనక్కు తగ్గిన పోలీస్ అధికారులు.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సపోర్ట్ తో అక్రమాలు, అవినీతి చేసిన నాయకుల విషయంలో కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు. కేసులు నమోదు విషయంలో కూడా పోలీస్ శాఖ దూకుడు ప్రదర్శిస్తోంది.

Also Read : లొంగిపోయిన బోరుగడ్డ.. పోలీసుల నెక్స్ట్ స్టెప్ ఇదే

ఇక తమను పోలీసులు టచ్ చేసే అవకాశం లేదు అని భావించిన.. వైసీపీ నేతలకు పోసాని, వల్లభనేని వంశీ మోహన్ అరెస్టులతో చుక్కలు చూపించింది పోలీస్ శాఖ. ఇక చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజనీ విషయంలో కూడా పోలీసులు ఇప్పుడు దూకుడుగానే ఉంటున్నారు. దీంతో వైసిపి నేతల్లో భయం మొదలైంది. బయటకు వచ్చి ఇన్నాళ్లు మాట్లాడిన కొంతమంది నాయకులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సైలెంట్ అయిపోయారు.

Also Read : ఎమ్మెల్యేలకు రేవంత్ క్లాస్.. గేర్ మార్చిన సీఎం

పోసాని కృష్ణ మురళి అరెస్టు వ్యవహారంలో ఆయన పెద్దగా మీడియాతో మాట్లాడే ప్రయత్నం చేయలేదు. అటు ఉత్తరాంధ్రకు చెందిన మరో మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా పెద్దగా మాట్లాడడానికి ఆసక్తి చూపించలేదు. విజయసాయి రెడ్డి వరకు పోలీసులు వెళ్ళటంతో వైసీపీ నేతల్లో ఆందోళన మొదలైంది. అటు జగన్ కూడా వైసీపీ నేతలకు సరైన సపోర్ట్ చేయడం లేదు అనే వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. కేవలం పొన్నవోలు సుధాకర్ రెడ్డి మీద మాత్రమే ఆధారపడి బెయిల్ పిటిషన్లు వాదిస్తున్నారని.. ఆయన కూడా కోర్టులో సమర్థవంతంగా వాదించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొంత మంది వైసీపీ నేతలు. అందుకే ఇన్నాళ్లు మాట్లాడిన నాయకులు ఇప్పుడు సైలెంట్ గా ఉండిపోయారు. మరి భవిష్యత్తులో ఏపీ పోలీసులు ఎవరిని అదుపులోకి తీసుకుంటారో చూడాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్