ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో పెద్ద ఎత్తున పోలీసుల విషయంలో ఆరోపణలు వచ్చాయి. రాజకీయ పార్టీలకు పోలీసులు బానిసత్వం చేయడం విమర్శలకు దారి తీసింది. రాజకీయంగా అప్పట్లో వైసీపీ బలంగా కనపడటంతో వైసీపీ నాయకులు ఆడిందే ఆటగా, పాడిందే పాటగా ఉండేది. వాటికి పోలీసులు కూడా తానా అంటే తందానా అనే సందర్భాలు ఉండేవి. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాతావరణం క్రమంగా మారుతూ వచ్చింది. ముందు మాట వినని పోలీసులు ఇప్పుడు దారిలోకి వచ్చేశారు.
Also Read : పొత్తుపై కీలక వ్యాఖ్యలు.. వారికి మాస్ వార్నింగ్..!
అప్పట్లో పోలీసులకు లేని గౌరవం ఇప్పుడు క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఇలాంటి సమయంలో.. వైఎస్ జగన్, వైసీపీ నేతలు పదే పదే.. పోలీసులను బెదిరిస్తూ వస్తున్నారు. కేసులు ఉన్న వాళ్ళను అరెస్ట్ చేసినా సరే బెదిరింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. ఇప్పుడు దీనిపై పలువురు వైసీపీ నేతలను హెచ్చరిస్తున్నారు. ఆ పార్టీ అధికారంలోకి రావాలి అంటే పోలీసులతో సఖ్యతగా ఉండటమే మంచిది అని.. ఎన్నికల సమయాల్లో పోలీసులు కీలకంగా ఉంటారు కాబట్టి పోలీసులను బెదిరించడం తగదని హెచ్చరిస్తున్నారు.
Also Read : ఫిక్సింగ్ జరిగిందా.. ముంబైపై క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్
ఇలాగే బెదిరిస్తూ పోతే.. వైసీపీ ప్రజల్లోకి వెళ్ళడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంటుందని, కీలక నియోజకవర్గాల్లో పోలీసుల సహకారం అత్యంత కీలకం కాబట్టి అనవసరంగా పోలీసులతో గోక్కోవడం మంచిది కాదని, పదే పదే పోలీసులను బట్టలూడదీస్తాం అంటూ హెచ్చరిస్తే వాళ్ళ పని వాళ్ళు చేస్తే.. వైసీపీ అధికారానికి మరింత కాలం దూరం కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. జగన్ మనస్తత్వం ఇప్పటికే పోలీసులకు ఓ క్లారిటీ వచ్చింది కాబట్టి.. వైసీపీ నాయకులు అయినా పోలీసులతో సఖ్యతగా మెలగాలని సూచిస్తున్నారు.

