Saturday, September 13, 2025 05:12 AM
Saturday, September 13, 2025 05:12 AM
roots

ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును వెలికితీసిన అధికారులు

ఎట్టకేలకు ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును ఇంజనీర్లు తొలగించారు. గేట్ల వద్ద అడ్డుగా ఉన్న మూడు పడవలను ఇంజినీర్లు, అధికారులు శతవిధాలుగా ప్రయత్నించి వెలికి తీశారు. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడో బోటును అధికారులు వెలికితీశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి మునిగిన మూడో పడవను అధికారులు ఎట్టకేలకు తొలగించారు. ఇనుప గడ్డర్లతో 2 పడవలను అనుసంధానించి బోటును వెలికితీశారు. చైన్‌ పుల్లర్లతో ఎత్తి బ్యారేజీ ఎగువకు తరలించారు. 40 టన్నుల బరువున్న ఈ పడవ బ్యారేజీ 69వ గేటు వద్ద ఢీకొని అడ్డుగా మారింది. దీన్ని ప్రస్తుతం ఇంజినీర్లు పున్నమి ఘాట్‌ వద్దకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు.

Read Also : ఏపీ టూ యూపీ… జగన్ కు బిగుస్తున్న ఉచ్చు

ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి కొట్టుకువచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, మరో 3 భారీ బోట్లు, ఒక మోస్తరు పడవ గేట్ల వద్ద చిక్కుకున్నాయి. ఇవి బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. దీంతో ఈ పడవలను తొలగించేందుకు పలు ప్లాన్​ అమలు చేసిన అధికారులు విఫలం అయ్యారు. దాదాపు 19 రోజుల ప్రయత్నాల అనంతరం రెండు పడవలను బయటకు తీశారు. తాజాగా ఇవాళ మూడో బోటును వెలికితీసి సఫలీకృతమయ్యారు. మరోవైపు నాలుగో పడవ కూడా ఉన్నట్టు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్