Saturday, September 13, 2025 03:21 AM
Saturday, September 13, 2025 03:21 AM
roots

కేంద్రంలో ఏపి ఎంపిల దూకుడు..!

ఏపీ ఎంపీలు దూకుడు పెంచారు. ఇంకా చెప్పాలంటే కేంద్రంలో చక్రం తిప్పుతున్నారనే మాట బలంగా వినిపిస్తోంది. గతం ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ 16, జనసేన 2, బీజేపీ 3, వైసీపీ 4 స్థానాల్లో ఎంపీలు గెలిచారు. కేంద్రంలో కూడా ఎన్డీయే సర్కార్ గెలవడంతో డబుల్ ఇంజిన్‌ సర్కార్ ప్రస్తుతం ఏపీలో దుమ్ము రేపుతోందనే చెప్పాలి. వైసీపీ ఎంపీలు మినహా… మిగిలిన వారంత తమ శాయశక్తుల ఏపీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో ఏపీ నుంచి ముగ్గురు ఎంపీలు మంత్రిపదవుల్లో ఉన్నారు. కేంద్ర మంత్రిగా కింజరావు రామ్మోహన్ నాయుడు, సహాయ మంత్రులుగా పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీనివాసరాజు ఉన్నారు.

కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 5 నెలల్లో పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. వేల కోట్ల రూపాయల నిధులు కూడా ఏపీకి కేటాయించింది మోదీ సర్కార్. ప్రధానంగా ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న రోడ్, రైల్వే ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు దక్కాయి. ఇక పెండింగ్ ప్రాజెక్టులకు కూడా నిధులు కేటాయించింది మోదీ సర్కార్. అమరావతి నిర్మాణానికి ఏకంగా రూ.15 వేల కోట్లు అప్పుగా ఇచ్చిన కేంద్రం… దానికి గ్యారంటీ కూడా తనదే అని బడ్జెట్ సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పేశారు. అలాగే ఐదేళ్ల వైసీపీ పాలన వైఫల్యం వల్ల పోలవరం ప్రాజెక్టు పనులు మళ్లీ మొదటికి వచ్చాయని ఏపీ ప్రభుత్వం వివరించడంతో… దానితో ఏకీభవించిన కేంద్రం… కాఫర్ డ్యామ్ నిర్మాణానికి రూ.900 కోట్లు కేటాయించింది.

ఇక అమరావతి మీదుగా ప్రత్యేక రైల్వే లైన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అలాగే పెండింగ్ ప్రాజెక్టులైన నరసాపురం-కోటిపల్లి, నడికుడి-శ్రీకాళహస్తి రైల్వే ట్రాక్ పనులకు నిధుల కేటాయింపు జరిగింది. రణస్థలం-శ్రీకాకుళం మధ్య హైవే విస్తరణ పనులకు గ్రీన్ సిగ్నల్, త్వరలోనే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు కానుంది. ఇక వీటితో పాటు విజయవాడ – విశాఖ మధ్య విమాన సర్వీసులు, విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం… వీటన్నిటికి తోడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులు ప్రారంభం… ఇలా ఎన్నో రకాలుగా ఏపీకి నిధులు వెల్లువెత్తుతున్నాయి.

Also Read : ఏపీ పూర్తి స్థాయి బడ్జెట్ డేట్ ఫిక్స్..!

ఇక వారంలో రెండు రోజుల పాటు ఏపీకి చెందిన ఎంపీలు ఎవరో ఒకరు ప్రధానితో భేటీ అవుతున్నారు. నిధుల కేటాయింపుపై దరఖాస్తులు చేస్తూనే ఉన్నారు. గతంలో ఐదేళ్ల వైసీపీ పాలనలో 22 మంది వైసీపీ ఎంపీలు ఉన్నప్పటికీ… కేంద్రం నుంచి ఆశించిన మేర నిధులు రాబట్టలేకపోయారు. ఇందుకు ప్రధానంగా రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన నివేదికలు పూర్తిస్థాయిలో చేరకపోవడంతో పాటు ఇచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే ఆరోపణలు కూడా. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటుకు భూ కేటాయింపు చేయలేదని స్వయంగా రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు. అలాగే పోలవరం సహా కీలక ప్రాజెక్టులకు నిధులను పెండింగ్‌లో పెట్టింది కేంద్రం.

ఇక రాజధాని నిర్మాణానికి సహకరిస్తామంటూ కేంద్రం హామీ ఇచ్చినప్పటికీ… వైఎస్ జగన్ మూడు రాజధానుల గురించి ప్రస్తావించడంతో… ఏ నగరానికి నిధులివ్వాలో తెలియకపోవడంతో… పైసా కూడా ఇవ్వలేదు. దీనితో పాటు కేంద్రం మెడలు వంచుతామన్న జగన్… కేసుల భయంతో కేంద్రం దగ్గర సాగిలపడ్డారనే మాటలు కూడా పెద్ద ఎత్తున వినిపించాయి. ఏది ఏమైనా… ప్రస్తుతం ఏపీలో ఎంపీలు మాత్రం కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో సక్సెస్ అయ్యారనే చెప్పాలి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్