రెండు రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ముగిసాయి. 15 రోజులు పాటు జరిగిన బడ్జెట్ సమావేశాల్లో 9 బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పలుమార్లు క్యాబినెట్ సమావేశాలు కూడా నిర్వహించింది. సమావేశాల్లో పలు కీలక ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇచ్చారు. వైసీపీ సమావేశాలకు హాజరు కాకపోయినా కొన్ని ప్రశ్నలు అడగటంతో వాటిని కొంతమంది మంత్రులు వివరణ ఇచ్చారు. ఇక శాసనమండలిలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేదిశగా మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కాస్త వ్యూహాత్మకంగా వ్యవహరించారు. మండలి లో కూడా మంత్రులు అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరిగింది.
Also Read : మరీ ఇంత బరితెగింపా..?
అయితే కొంతమంది మంత్రుల, అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అసహనంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రశ్నోత్తరాల సమయంలో కీలక ప్రశ్నలు ఉన్న సమయంలో కొంతమంది అధికారులు మంత్రులకు సమాచారం ఇవ్వకుండా తప్పించుకుని తిరిగారు. దీనిపై కొంతమంది మంత్రులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. ఇక ఇదే సమయంలో మంత్రుల వ్యవహార శైలిపై కూడా విమర్శలు వచ్చాయి. ముగ్గురు నలుగురు కీలక శాఖల మంత్రులు.. ప్రశ్నోత్తరాలు సమయంలో సభకు ఆలస్యంగా రావడం చర్చనీయాంశం అయింది. చంద్రబాబు నాయుడు సభలో ఉన్న సమయంలో కూడా కొంతమంది మంత్రులు సభలో లేకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు సీరియస్ గా ఉన్నట్లు సమాచారం.
Also Read : పోలీసులకు మూడుతోంది… ప్రక్షాళన మొదలు
అలాగే తమ శాఖలపై కొంతమంది మంత్రులు ఇంకా పట్టు పెంచుకోలేదనే అసహనం ముఖ్యమంత్రి చంద్రబాబులో కనపడుతుంది. కొత్త మంత్రులకు ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. గతంలో విమర్శలు వచ్చిన మంత్రులు తమ పనితీరుని మెరుగుపరుచుకోగా మరి కొంతమంది మంత్రులు మాత్రం తమ వ్యవహార శైలిలో మార్పు లేకుండానే సమావేశాలకు హాజరయ్యారు. ఇక సమావేశాలు లేని సమయంలో విజయవాడలోనే ఎక్కువగా గడిపిన మంత్రులు పై కూడా ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంటున్నాయి. వచ్చే నెల మూడో తారీఖున క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఆ సమయానికి మంత్రుల పనితీరుపై చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇవ్వనున్నారట.
Also Read : 50 కోట్ల రూపాయల కుక్క.. బిజినెస్ మెన్ డాగ్ లవ్
మంత్రులు సమావేశాలకు హాజరైన తీరు అలాగే ప్రశ్నోత్తరాల సమయంలో వారు చెప్పిన సమాధానాలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నివేదిక సిద్ధం చేసింది. స్వయంగా క్యాబినెట్ సమావేశం తర్వాత మంత్రులకు వారి పనితీరుపై చంద్రబాబు నాయుడు వివరించనున్నారు. అటు మీడియా సమావేశాలకు దూరంగా ఉంటున్న మంత్రులపై కూడా రాష్ట్ర ప్రభుత్వం కాస్త అసహనంగానే ఉంది.




