Friday, September 12, 2025 07:26 PM
Friday, September 12, 2025 07:26 PM
roots

వాట్సాప్ లోనే ఇంటర్ హాల్ టికెట్.. ప్రాసెస్ ఇదే..!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాంకేతిక పరిజ్ఞానానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పుడు వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ వరకు వాట్సాప్ ద్వారానే సేవలు అందించేందుకు సిద్దమైంది. అలాగే దేవాదయా శాఖ, రెవెన్యూ సహా ఎన్నో శాఖల సేవలను వాట్సాప్ లోనే అందిస్తారు. ఒక నెంబర్ కు మెసేజ్ చేస్తే చాలు వాట్సాప్ లో పలు సేవలను వినియోగించుకునే అవకాశం ఉంది. దేశంలోనే తొలిసారి వాట్సాప్ సేవలకు రాష్ట్రం శ్రీకారం చుట్టింది.

Also Read : ఒక్క టూర్ తో సెన్సేషన్ క్రియేట్ చేసిన లోకేష్

ఇక ఇప్పుడు వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. నేటి నుంచే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించారు. వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకునే సదుపాయం కల్పించింది విద్యాశాఖ. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఒకసారి చూస్తే.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్కి హాయ్ (Hai) అనే వాట్సప్లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది. దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి.

Also Read : నెట్ ఫ్లిక్స్ లో పుష్ప సరికొత్త రికార్డులు

అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి. అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్ లోడ్పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఏపీలో ఇంటర్ పరిక్షలు పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్