Wednesday, February 4, 2026 11:10 AM
Wednesday, February 4, 2026 11:10 AM

ఐఏఎస్ భార్య మృతి.. ఎన్నో అనుమానాలు..!

ఏపీ ఐఏఎస్ అధికారి క్రిస్ట్ కిషోర్ కుమార్ మెడకు హత్య కేసు చుట్టుకుందా.. అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఈ నెల 3వ తేదీ తెల్లవారజామున ఐఏఎస్ అధికారి క్రిస్ట్ కిషోర్ కుమార్ సతీమణి సత్య గీతిక అనుమానాస్పదరీతిలో మృతి చెందారు. నిజానికి ఆమె చనిపోయిన సమయంలో విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా వారం రోజుల క్రితం డిసెంబర్ 31వ తేదీన గొంతు నొప్పి కారణంగా ఐఏఎస్ కిషోర్ కుమార్ సతీమణి సత్య గీతిక విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆమె కోలుకుంటున్నారని వైద్యులు వెల్లడించిన గంటల వ్యవధిలోనే మృతి చెందడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది. నిజానికి ఆమె మరణంపై తొలుత ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవు. కానీ ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అందరి దృష్టి కిషోర్ కుమార్ వైపు మళ్లింది.

Also Read : షమీని కూడా వదల్లేదు.. తెలుగు యువకుడి వీర విహారం

ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ కృష్ణ గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా క్రిస్ట్ కిషోర్ కుమార్ పని చేస్తున్నారు. ఈయన తీరు తొలి నుంచి వివాదాస్పదంగానే ఉంది. గతంలో విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్‌గా పని చేసిన సమయంలో కిషోర్ కుమార్ పై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అక్రమార్కులకు అప్పనంగా కట్టబెట్టారనే ఆరోపణలున్నాయి. సుమారు 225 ఎకరాల ప్రభుత్వ భూములను అప్పట్లో వైసీపీ నేతలకు నిబంధనలకు విరుద్ధంగా కేటాయించారనేది కిషోర్ కుమార్‌పై ప్రధాన ఆరోపణ. భోగాపురం, కొత్తవలస, బొబ్బిలి, పార్వతీపురం, జామి, విజయనగరం మండలాల్లో భూములను అక్రమార్కులకు కిషోర్ కుమార్ అప్పగించారని 2022లో అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి ప్రభుత్వానికి లేఖ రాసింది. కిషోర్ కుమార్‌పై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా లేఖలో సిఫార్సు చేశారు. దీంతో కిషోర్ కుమార్‌ను నాటి జగన్ సర్కార్ 2022 మార్చి నెలలో జీఏడీకి బదిలీ చేసింది.

Also Read : 5 వేల కిలోమీటర్లు..? జగన్ సరికొత్త ప్లానింగ్..?

నాటి వైసీపీ పెద్దలతో కిషోర్ కుమార్ అత్యంత సన్నిహితంగా మెలిగారనేది బహిరంగ రహస్యం. కిషోర్ కుమార్ తీరుపై వైసీపీలో ఒక వర్గం నేతలు అప్పట్లో పార్టీ పెద్దల దృష్టికి కూడా తీసుకెళ్లారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు కిషోర్ కుమార్ నమ్మినబంటు అనేది జిల్లాలో వినిపిస్తున్న మాట. అవి నిజమే అన్నట్లుగా కిషోర్ తీరు ఉండేది. 2022 జనవరి ఒకటవ తేదీన న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పేందుకు మంత్రి క్యాంపు కార్యాలయం వచ్చిన కిషోర్ కుమార్.. అందరి ముందే బొత్స కాళ్లకు నమస్కారం చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై బొత్స స్వయంగా వివరణ ఇవ్వాల్సి వచ్చింది. తనకు 70 ఏళ్ల వయసు అని.. 50 ఏళ్ల కిషోర్ కుమార్ తన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారని బొత్స కవర్ చేయాల్సి వచ్చింది.

Also Read : చెల్లెమ్మను ఎలా దారిలో పెట్టాలి..?

కిషోర్ కుమార్ సతీమణి సత్య గీతిక కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. సరిగ్గా నెల రోజుల క్రితం విజయవాడలోని ఆయుష్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. అయితే మళ్లీ డిసెంబర్ 31న మరోసారి గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యతో ఆసుపత్రిలో చేరారు. మరో రెండు రోజుల్లో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవుతారనగా.. ఈ నెల 3వ తేదీ తెల్లవారుజామున 2.30 గంటలకు ఆమె మరణించినట్లు ఆసుపత్రి వైద్యులు గుర్తించారు. ఆ సమయంలో సత్య గీతికతో పాటు భర్త కిషోర్ కుమార్ మాత్రమే ఆ గదిలో ఉన్నారు. ఆమె మరణంపై అనుమానం వ్యక్తం చేసిన ఆసుపత్రి వైద్యులు విజయవాడ పటమట పోలీసులకు ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తామిద్దరు రాత్రి కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత పక్కనే ఉన్న సోఫాలో నిద్రపోయానని.. అర్థరాత్రి 2 గంటల సమయంలో తనకు మెలుకువ రావడంతో.. లేచి చూడగా.. అప్పటికే తన భార్య సత్య గీతిక అచేతన స్థితిలో ఉన్నారని పోలీసులకు కిషోర్ కుమార్ వాంగ్మూలం ఇచ్చారు. సత్య గీతిక సోదరి కూడా తన అక్క మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేయడంతో.. రంగంలోకి దిగిన పోలీసులు.. శవాన్ని పోస్టుమార్టంకు పంపారు. ఈ నివేదిక వస్తే తప్ప.. ఐఏఎస్ అధికారి క్రిస్ట్ కిషోర్ కుమార్ సతీమణి సత్య గీతిక మృతికి కారణాలు బయటకు వచ్చే అవకాశం లేదు. మరి ఫోరెన్సిక్ నివేదిక ఎప్పుడు వస్తుందో.. అందులో ఏం నిజాలు ఉంటాయో చూడాలి.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్