ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో ఎప్పుడు ఏ పరిణామం చోటు చేసుకుంటుందో అర్థం కాక.. పోలీస్ వర్గాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న కొందరు వ్యక్తుల విచారణలో వెల్లడైన అంశాలపై కూడా మీడియాలో చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కొందరు వ్యక్తులకు మాత్రమే.. లిక్కర్ కుంభకోణంలో పాత్ర ఉన్నట్లు.. అధికారులు గుర్తించారు. దీనితో గత ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ఒక్కొక్కరిని అరెస్టులు చేశారు.
Also Read : పవన్ కు ఊహించని షాక్ ఇచ్చిన హైకోర్టు
అందులో వైయస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు వ్యక్తులు కీలకంగా ఉన్నట్లు తేల్చారు. వైయస్ జగన్ మాజీ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, వైయస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అని ఐఏఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టిన ధనుంజయ రెడ్డి, వైయస్ భారతి వ్యాపార వ్యవహారాలు చూసే.. బాలాజీ గోవిందప్ప లిక్కర్ కేసులో.. అత్యంత కీలకపాత్ర పోషించినట్లు ఆధారాలతో సహా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 3 నెలల నుంచి వీళ్ళ ముగ్గురు విజయవాడ జైల్లోనే ఉన్నారు. వీరిని బయటకు తీసుకురావడానికి వైసిపి ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది.
Also Read : ఆ ముగ్గురు.. వారి వారసులు.. తేడా ఎందుకిలా..?
తాజాగా వీరు ముగ్గురు మరోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించింది హైకోర్టు. ఆ వీరితోపాటుగా రాజంపేట ఎంపీ మిధున్ రెడ్డి ప్రస్తుతం మద్యంతర బెయిల్ పొందారు. ఇక ఇదే కేసులో అరెస్టయిన రాజ్ కేసిరెడ్డి, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సహా మరి కొందరు ప్రస్తుతం జైల్లోనే ఉన్నారు. వారు కూడా హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో త్వరలోనే ఒకరిద్దరిని అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం కూడా జరుగుతుంది.




