గతంలో ఐఏఎస్, ఐపిఎస్ అధికారులంటే సమాజంలో ఓ గౌరవం, వారికి అంటూ ఓ ప్రత్యేకత ఉండేది. రాజకీయ నాయకులు ఎంత బలంగా ఉన్నా వాళ్ళకంటూ ఓ స్టైల్ ఉండేది. అదే ఫాలో అయ్యే వాళ్ళు. పరిపాలన విషయంలో పక్కా లెక్కలతో ఉండేవారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సరే ఆలోచించి అడుగులు వేసే వాళ్ళు. కానీ కానీ 2004 నుంచి ఏపీలో పని చేసిన ఆల్ ఇండియా సర్వీసు అధికారుల లెక్క మారింది. ఏం కోరుకున్నారో తెలియదు గాని వారిలో మార్పు వచ్చింది. జైలు జీవితాలు గడిపిన వాళ్ళు ఉన్నారు.
ఇక గత 5 ఏళ్ళు ఏపీలో పని చేసిన వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు జైలుకు వెళ్లేందుకు రంగం సిద్దమవుతోంది. ఇటీవల కొందరు సస్పెండ్ అయ్యారు, కొందరు విధుల్లోకి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పుడు మరో ఐఏఎస్ అధికారి జైలు జీవితం గడపడం ఖరారు అయింది. ఆయనే ప్రవీణ్ ప్రకాష్… జగన్ సర్కార్ లో బీహారి కింగ్. ఇప్పుడు ఈయనకు కోర్ట్ జైలు శిక్ష విధించింది. మాజీ విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా విధులు నిర్వహించిన ప్రవీణ్ ప్రకాష్ కు… మాజీ కార్యదర్శి శేషగిరి కి నెల రోజులు సాధారణ జైలు శిక్ష 2000 జరిమానా విధించింది ఏపీ హైకోర్ట్.
అప్పీల్ కు వెళ్లేందుకు నాలుగు వారాలు గడువు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఇచ్చిన తీర్పుల ధిక్కరించిన నేపధ్యంలో కోర్ట్ ఈ తీర్పు ఇచ్చింది. పరిపాలన అధికారిగా పనిచేసిన ఎం విజయలక్ష్మి 2022లో ఆగస్టు లో పదవీ విరమణ చేసారు. 62 సంవత్సరాలు పెంచుతూ 22 జనవరిలో ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. తనకు ఇంకా రెండు సంవత్సరాలు సర్వీస్ ఉందంటూ విద్యాశాఖకు అప్లికేషన్ ఇచ్చారు ఆమె. అయినా సరే విద్యాశాఖ లెక్క చేయలేదు. దీనితో కోర్ట్ మెట్లు ఎక్కారు విజయలక్ష్మి. 62 ఏళ్ల పాటు ఉద్యోగం చేయాలని 23 ఫిబ్రవరిలో కోర్ట్ తీర్పు ఇచ్చింది. గత నెల వరకు అమలు చేయకపోవడంతో కోర్టుదిక్కారం కేసులో జైలు శిక్ష విధించింది న్యాయస్థానం.