Saturday, September 13, 2025 03:21 AM
Saturday, September 13, 2025 03:21 AM
roots

అదానికి ఏపీ ప్రభుత్వం షాక్…?

దేశ వ్యాప్తంగా గౌతం అధాని అవినీతి వ్యవహారం తీవ్ర దుమారమే రేపుతోంది. గౌతం ఆదాని నుంచి అప్పటి జగన్ సర్కార్… విద్యుత్ ఒప్పందాల కోసం భారీగా లంచాలు తీసుకుంది అనే వార్తలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కేంద్రాన్ని టార్గెట్ చేస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పుడు కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అదానీ ఎనర్జీ నుంచి సౌర విద్యుత్ పొందేందుకు పాతికేళ్లకు సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రద్దు చేసేందుకు ఏపి ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Also Read: రిమాండ్ రిపోర్ట్ తో విజయ్ పాల్ కి ఉచ్చు బిగించిన పోలీసులు

తాజాగా లోకేష్ ప్రకటనతో నిర్ధారణ అయింది ఈ విషయం. అదానీ నుంచి జగన్ ముడుపులు అందుకున్నారంటూ పరోక్షంగా అసెంబ్లీలో ప్రస్తావించారు చంద్రబాబు. ఈ విషయంలో ఏం చేయాలో పరిశీలిస్తున్నట్లు ఇప్పటికే వెల్లడించారు లోకేష్. వివాదాస్పద ఒప్పందాన్ని రద్దు చేస్తామని ఆర్ధికమంత్రి పయ్యావుల కూడా క్లారిటీ ఇచ్చారు. అదానీ గ్రూప్‌తో అనుసంధానమైన విద్యుత్ సరఫరా ఒప్పందాన్ని రద్దు చేసే అవకాశాలను అన్వేషించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫైళ్ల సమీక్ష జరుపుతోంది. దీనిపై త్వరలోనే కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

Also Read: ఏపీ రాజ్యసభ అభ్యర్ధులు ఫైనల్ అయినట్లే…?

గతంలో జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ హయాంలో జరిగిన ఈ ఒప్పందానికి సంబంధించిన అంతర్గత ఫైళ్లన్నింటినీ ప్రభుత్వం తవ్వి బయటకు లాగుతోంది. కాంట్రాక్ట్‌ను రద్దు చేసే అవకాశం ఉన్నట్లేనని మంత్రి అభిప్రాయ పడ్డారు. తర్వాత ఏం చేయాలో కూడా తాము పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం ఈ సమస్యను నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి స్పష్టం చేసారు. దీనిపై మంత్రి లోకేష్ మాట్లాడుతూ ఆర్థిక మంత్రి చెప్పిందే ప్రభుత్వ విధానం అంటూ స్పష్టత ఇచ్చారు. సోమవారం దీనిపై ముఖ్యమంత్రి సమీక్ష చేసే అవకాశం ఉంది. రద్దు చేయడమా కొనసాగించడమా అనే విషయం పై సోమవారం ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్