Friday, September 12, 2025 05:50 PM
Friday, September 12, 2025 05:50 PM
roots

వాట్సాప్ సేవలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

సచివాలయంలో 5 వ బ్లాక్ లో జరుగుతున్న కలెక్టర్ల కాన్ఫరెన్స్ లో వాట్సాప్ సేవలు చర్చకు వచ్చాయి. దీనిపై కీలక ప్రకటన చేసారు అధికారులు. ప్రస్తుతం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారాలో మన మిత్ర ద్వారా 210 సేవలు అందుబాటులోకి ఉన్నట్లు తెలిపిన అధికారులు… మరో 15 రోజుల్లో వీటిని 350కు పెంచుతామని తెలిపారు. వాట్సాప్ ద్వారా డిజిటల్ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు వివరించారు. వాట్సాప్ గవర్నెన్స్‌ కు అనూహ్య స్పందన ఉందని… ఈ సేవలను మరింత విస్తృత పరచాలని సిఎం సూచించారు.

Also Read: చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. జగన్ కోటకు బీటలు..!

ప్రజలే ఫస్ట్ విధానంలో భాగంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రామాలపై ఫీడ్ బ్యాక్ మెకానిజం కూడా ఏర్పాటు చేయాలని సిఎం సూచించారు. ఐవిఆర్ఎస్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి విధానాల ద్వారా లబ్దిదారుల అభిప్రాయాలను సేకరించాలని.. ఇందుకోసం వాట్సాప్ సేవలను వాడుకోవాలని నిర్ణయించారు. 22 ప్రభుత్వ సేవల్లో పాజిటివ్ పర్సెప్షన్‌పై సర్వే చేస్తున్నామని సిఎం తెలిపారు. ప్రతి వారం నాలుగు సర్వీసులపై సమీక్ష చేసి… దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. ఇక భూముల వ్యవహారాలపై కూడా సుదీర్ఘంగా చర్చ జరిగింది.

Also Read: ఎన్నారైలకు చంద్రబాబు పిలుపు..!

ఫ్రీ హోల్డ్ లో ఉన్న భూములు, భూ వివాదాలు, ఫిర్యాదులు, అర్జీలపై సిసిఎల్ఎ నివేదిక ఇచ్చింది. ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో రెవెన్యూ సమస్యలపై అర్జీలు వస్తున్నాయన్నారు మంత్రి నారా లోకేష్. ఇక భూ వివాదలకు కారణాలపై కలెక్టర్ల సదస్సులో గంటపాటు చర్చ జరిగింది. తమ అభిప్రాయాలు, అనుభవాలను మంత్రులు అనగాని, పార్థసారధి, జిల్లా కలెక్టర్లు వెల్లడించారు. గత ప్రభుత్వం భూ సర్వే పేరుతో అనుసరించిన అస్థవ్యస్థ విధానం వల్ల భూ వివాదాలు పెరిగాయని మంత్రులు వివరించారు. భూ సమస్యలకు, ప్రజల అర్జీలకు పరిష్కారం చూపాల్సిందేనని సిఎం స్పష్టం చేసారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

పోల్స్