Saturday, September 13, 2025 03:22 AM
Saturday, September 13, 2025 03:22 AM
roots

పొగాకు రైతులకు 24 గంటల్లోనే.. చంద్రబాబు సర్కార్ కీలక నిర్ణయం

పొగాకు రైతుల విషయంలో ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక ఇబ్బందులు పడుతున్న పొగాకు రైతులకు పెద్ద ఎత్తున నిధులు విడుదల చేసింది. పొగాకు రైతుల ఖాతాల్లోకి 48 గంటల్లోపే నగదు జమ చేయనుంది రాష్ట్ర ప్రభుత్వం. మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన నల్ల బర్లీ పొగాకు కు సంబంధించి 273 కోట్ల నగదు విడుదలకు రాష్ట్ర క్యాబినేట్ ఆమోద ముద్ర వేసిన 24 గంటల్లోనే తొలివిడత గా 100 కోట్ల నగదు విడుదల చేసింది చంద్రబాబు సర్కార్.

Also Read : జగన్ కొత్త ప్లాన్ వర్కవుట్ అవుతుందా..?

దీనిపై వ్యవసాయ శాఖా మంత్రి అచ్చేన్నాయుడు ప్రకటన చేసారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాలను పెంచి కొనుగోలు వేగవంతం చేస్తున్నామని, రైతులకు 48 గంటల్లోపు నగదును జమ చేస్తున్నామని తెలిపారు. రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో పొగాకు కొనుగోలుకు సంబంధించి 273 కోట్ల రూపాయల విడుదలకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని, తక్షణమే 100 కోట్ల రూపాయలను విడుదల చేసిందని తెలిపారు. బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోలుపై మార్క్ ఫెడ్ వ్యవసాయశాఖ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నామని అన్నారు.

Also Read : గంభీర్ ఎరా.. కోచ్ సాబ్ గ్రేటెస్ట్ పెర్ఫామెన్స్

కొనుగోలు కేంద్రాల వద్ద ఏ ఇబ్బందులు కలుగకుండా చూస్తున్నామన్నారు మంత్రి. రైతుల నుంచి ప్రతి ఆకు కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, సీఎం యాప్ లో రైతుల పేర్ల నమోదు వేగంగా చేపడుతున్నామని వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బ్లాక్ బర్లీ పోగాకు కొనుగోలు కొనసాగుతుందని, ఇప్పటివరకు బాపట్ల జిల్లాలోని కొనుగోలు కేంద్రాల్లో రోజుకు 30 మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు జరుగుతుందని, దీనిని 50 మెట్రిక్ టన్నులకు పెంచేలా అధికారులు సన్నద్ధం అవ్వాలని ఆదేశించారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్