ఆంధ్రప్రదేశ్ లో నూతన ఎక్సైజ్ పాలసీ కోసం జనాలు కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు మందు బాబులు. ఇంకెన్నాళ్ళు మాకు ఈ పిచ్చి మందు అంటూ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఇటీవల నూతన మద్యం పాలసీకి శ్రీకారం చుట్టిన చంద్రబాబు సర్కార్ ఇప్పుడు కొత్త మద్యం షాపుల నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు మొదలుపెట్టింది. రెండు మూడు రోజుల్లోగా నోటిఫికేషన్ జారీ చేసే సూచనలు కనపడుతున్నాయి. గత ప్రభుత్వం… ప్రైవేట్ రంగాన్ని కాదని తానే మద్యం దుకాణాలు నడిపేలా చట్టం చేసి సంచలనం సృష్టించింది.
ప్రభుత్వం మారడంతో ఆ చట్టాన్నిసవరించి ఆర్డినెన్స్ తెచ్చేందుకు కెబినెట్ ఆమోదం ఇటీవల ఆమోదం తెలిపింది. ఆర్డినెన్స్ ఆమోదం కోసం సవరణ బిల్లును నేడు గవర్నర్ వద్దకు పంపనుంది. ఇవాళ లేదా రేపటిలోగా ఆర్డినెన్సును గవర్నర్ ఆమోదిస్తారు. మొత్తం 3736 మద్యం షాపుల కేటాయింపునకు నోటిఫికేషన్ ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇందులో 340 షాపులను కల్లు గీత వృత్తి కులాలకు రిజర్వ్ చేస్తారు.
Read Also : చిత్ర పరిశ్రమకు పవన్ హెచ్చరిక
రిజర్వేషన్ల కోటాలోని షాపులను ఎక్కడెక్కడ కేటాయించాలన్న అంశంపై సైతం అబ్కారీ శాఖ కసరత్తు చేస్తోంది. ఇక కల్లు గీత వృత్తి కులాల జనాభా ఏయే జిల్లాల్లో.. ఏయే నియోజకవర్గాల్లో ఎంత మేరకు ఉన్నారనే అంశంపై ఆరా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆరా తీసింది. వివరాలను బీసీ సంక్షేమ శాఖ నుంచి రాష్ట్ర ఎక్సైజ్ శాఖ పూర్తి స్థాయిలో సేకరిస్తోంది. కల్లు గీత వృత్తి కులాల జనాభా ప్రాతిపదికనే మద్యం షాపులను రిజర్వ్ చేయనుంది ఎక్సైజ్ శాఖ. ఇక జాతీయ స్థాయిలో ఉండే ప్రముఖ బ్రాండ్ లను రాష్ట్రానికి తెస్తున్నారు. కల్తీ లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.