గత అయిదేళ్లుగా వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో రెచ్చిపోయిన సోషల్ మీడియా మృగాలను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. వైసీపీ సోషల్ మీడియా విష ప్రచారంలో సజ్జల భార్గవ రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ కీలకమని గుర్తించి వారిపై కూడా కేసులకు రంగం సిద్దం చేసారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్తెలపై పిచ్చి వ్యాఖ్యలతో పోస్టులు పెట్టిన వారిపై ‘పోక్సో’ చట్టాన్ని ప్రయోగించడానికి రెడీ అయ్యారు. భార్గవ్ రెడ్డి, ఇంటూరి రవి కిరణ్ పై ఫోక్సో కేసులు పెట్టనున్నారు. బోరుగడ్డ అనీల్ పై కూడా ఈ కేసులు పెట్టె ఛాన్స్ ఉంది.
Also Read : వారిద్దరి కష్టం… బూడిదలో పోసిన పన్నీరేనా..?
ఇప్పటికే కళ్ళం హరికృష్ణా రెడ్డి ను అదుపులోకి తీసుకున్నారు గుంటూరు పోలీసులు. పరిటాల శ్రీరామ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కల్లం హరికృష్ణా రెడ్డి…. ఆ తర్వాత పలు సందర్భాల్లో తీవ్ర వ్యాఖ్యలు చేసాడు. గత ప్రభుత్వంలో అనంతపురం జిల్లాలో పరిటాల శ్రీరామ్ పై తొడ కొట్టి నీ అంతు చూస్తానంటూ సవాల్ విసిరిన కళ్ళం హరికృష్ణా రెడ్డిపై కూడా పలు కేసులు నమోదయ్యే ఛాన్స్ ఉంది. ఫోక్సో చట్టంపై ఇతనిపై కేసు నమోదు కానుందని సమాచారం. ఇక గోపాలపురంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ ఫోటోలను అసభ్యంగా మార్ఫ్ చేస్తున్నాడు. తూర్పుగోదావరి జిల్లా ఒడిసిలేరు గ్రామానికి చెందిన వీరభత్తుల చంద్రశేఖర్ అనే వ్యక్తి మార్ఫింగ్ చేసి సోషల్ మీడియా వేదికగా తప్పుగా ప్రచారం చేస్తున్నాడని గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. IT (ACT) కింద కేసు నమోదు చేసారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ఫొటోలను అసభ్యకరంగా మార్ఫింగ్ చేసాడు.
Also Read : భజన చేస్తే తాట తీస్తా… బాబు మాస్ వార్నింగ్…!
ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అభ్యంతరకర కామెంట్స్ చేయడంతో… గుంటూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ మేకా వెంకట రామిరెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేసారు. అలాగే కల్లి నాగిరెడ్డి, బోడె వెంకటేష్ అనే ఇద్దరు కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్రా రవీంద్రా రెడ్డిని అరెస్ట్ చేసినా పోలీసులు 41 ఏ నోటీసులు ఇచ్చి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. అతని కోసం నాలుగు బృందాలు గాలిస్తున్నాయి.