Friday, September 12, 2025 10:37 PM
Friday, September 12, 2025 10:37 PM
roots

ఏపీలో మెట్రో పరుగులు…?

దాదాపు పదేళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్ లో మెట్రో ప్రాజెక్ట్ లపై ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో తాజాగా ఏపీ సర్కార్ కీలక అడుగులు వేసింది. విజయవాడ, విశాఖపట్నాల్లో మెట్రోరైలు ప్రాజెక్టులను చేపట్టేందుకు 2024 ధరల ప్రకారం రూ.42,362 కోట్లు సమకూర్చాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. విజయవాడలో రెండు దశల్లో మూడు కారిడార్ల పనులకు రూ.25,130 కోట్లు, విశాఖలో రెండు దశల్లో నాలుగు కారిడార్ల పనులకు రూ.17,232 కోట్లు అవసరమని అంచనా వేస్తూ ప్రతిపాదన పంపింది.

ఏపీ పునర్విభజన చట్టం-2014 ప్రకారం మెట్రోరైలు ప్రాజెక్టుల నిర్మాణానికి కేంద్రమే నిధులివ్వాలని, రెండు నగరాల్లో కలిపి 258 ఎకరాల భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేసింది. 2014-19 తెదేపా ప్రభుత్వ హయాంలో విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రయత్నం జరిగిందని అందులో ప్రస్తావించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్) కేంద్రం ఆమోదానికి వెళ్లాయని… మెట్రోరైలు కొత్త విధానం ప్రకారం వాటిని సవరించాలని కేంద్ర పట్టణ, గృహనిర్మాణ మంత్రిత్వశాఖ సూచించినా… కానీ, వైకాపా ప్రభుత్వం మెట్రోరైలు ప్రాజెక్టులను అటకెక్కించిందని పేర్కొంది.

Also Read : పాత ప్లాన్ అమలు చేస్తున్న జగన్… వర్కవుట్ అవుతుందా…?

విజయవాడలో భూ సేకరణ ప్రతిపాదనలనూ రద్దుచేసి, ప్రాజెక్టుకు పూర్తిగా వదిలేసిందని సార్వత్రిక ఎన్నికల ముందు విశాఖలో మెట్రో రైలు ప్రాజెక్టు పనులకు హడావుడి చేసినట్టు పేర్కొంది. కోల్కతా మోడల్లో నిధులివ్వాలి ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. విజయవాడ, విశాఖలో మెట్రోరైలు ప్రాజెక్టులు ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం మూడు నెలల్లోనే డీపీఆర్ లు తయారు చేస్తుందని ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితులు, నిధుల కొరత దృష్టిలో పెట్టుకుని ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు మొత్త కేంద్రమే భరించాలని విజ్ఞప్తి చేసింది.

కలకత్తాలో తూర్పు-పశ్చిమ మెట్రోరైలు ప్రాజెక్టు నిర్మాణానికి 2017 మెట్రోరైలు పాలసీలో కేంద్రం 100% నిధులు సమకూర్చిన విషయాన్ని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ గత నెలలో దిల్లీలో కేంద్ర పట్టణ, గృహనిర్మాణ శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ ని కలిసి ప్రస్తావించారు. అదే మోడల్లో ఆంధ్రప్రదేశ్ కూ నిధులివ్వాలని విజ్ఞప్తి చేసారు. మరి అంతా అనుకున్నట్లు జరిగితే రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే రాష్ట్రంలో మెట్రో పరుగులు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్