ఆంధ్రప్రదేశ్ లోనే కాకుండా దేశ వ్యాప్తంగా తిరుమల కల్తీ లడ్డు వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. వైసీపీ ప్రభుత్వ హాయంలో తక్కువ ధరకు నెయ్యి వస్తుంది అనే కారణంతో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఒక సంస్థ నుంచి నెయ్యి కొనుగోలు చేసారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై చంద్రబాబు నాయుడు ఆరోపణలు చేయడం ఆ తర్వాత దేశ వ్యాప్తంగా దుమారం రేగడం జరిగాయి. దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఓ దీక్ష కూడా చేసారు. ఇక ఈ కేసు విషయంలో తిరుమలలో ఇప్పుడు కీలక అడుగులు పడుతున్నాయి.
Also Read : విజయ్ పాల్ అరెస్ట్ కి లైన్ క్లియర్
లడ్డు నాణ్యత లో కూడా మార్పులు వచ్చాయని భక్తులు చెప్తున్నారు. దీనిపై సిబిఐ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ పోలీస్ అధికారులతో కలిసి ప్రత్యేక సిట్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ వేగవంతం చేశారు అధికారులు. నేడు తిరుపతికి సిట్ టీంలోని ఉన్నతాధికారులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ప్రాథమిక దర్యాప్తుతో ఆధారాలు సేకరించిన సిట్ బృందం.. నేడు పలు కీలక అంశాలపై విచారణ చేయనుంది. సిట్ టీం ఎంక్వయిరీకి సహకరిస్తున్న 30 మందిలో 4 డీఎస్పీలు, 8 మంది సీఐలు ఉన్నారు. తిరుపతిలోని భూదేవి కాంప్లెక్స్ ను కార్యాలయంగా చేసుకొని దర్యాప్తు చేయనున్నారు.
Also Read : ఆ నేతల మధ్య సఖ్యత కుదురుతుందా…?
ఇప్పటికే స్టేట్ సిట్ టీం చేసిన 3 రోజుల విచారణ ఆధారాలు స్వాదీనం చేసుకున్న సిట్ అధికారులు… తమిళనాడులోని దిండిగల్ ఏఆర్ డయిరీలో 14 గంటలకు పైగా తనిఖీలు నిర్వహించిన ఆధారాలు సేకరించారు. టీటీడీకి నెయ్యి సరఫరా చేసేందుకు టెండర్ దక్కించుకున్న ఏఆర్ డయిరీ వైష్ణవీ డయిరీ ద్వారా నెయ్యి ని సమకూర్చినట్లు ఇప్పటికే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోవైపు ఏఆర్ డయిరీ సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు NDDB కాఫ్ ల్యాబ్ నివేదికను బయట పెట్టింది టిటిడి. దీనితో విచారణలో ఏ అంశాలు వెలుగులోకి వస్తాయి అనే దానిపై ఆసక్తి నెలకొంది.