దేశంలో ఎక్కడా లేని విధంగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు చెలరేగిపోయిన విధానం చూసి… ఇతర రాష్ట్రాల్లో భాష రాని వారు కూడా షాక్ అయ్యారు. తప్పుడు ప్రచారం చేయవచ్చు గాని కుటుంబ సభ్యులపై వ్యక్తిగత విమర్శలు… అక్రమ సంబంధాలు అంటకట్టడం వంటివి నేరం, పాపం కూడా. అందుకే ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల బెండు తీస్తున్నారు ఏపీ పోలీసులు. దీనిపై ప్రభుత్వం సీరియస్ గా ఉండటంతో… ఎక్కడా వెనకడుగు వేయడం లేదు పోలీసులు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పిడి యాక్ట్ పెట్టేందుకుప్రభుత్వం సిద్ధం అవుతోంది.
Also Read : బాబు టార్గెట్ అదే… బీ కేర్ ఫుల్..!
ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్(పీడీ) చట్టం ప్రయోగానికి ఏపి ప్రభుత్వం సిద్ధం అయింది. ఉచ్ఛనీచాలు మరచి, జుగుప్సాకర పదజాలంతో పేట్రేగుతున్న ఉన్మాద మూక ఇకపై ఏడాది దాకా జైల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రివెన్షన్ ఆఫ్ డేంజరస్ యాక్టివిటీస్ చట్టం- 1986 (ప్రమాదకర కార్యకలాపాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లు ఇటీవల అసెంబ్లీలో ఆమోదం తెలిపారు. గవర్నర్ అనుమతి లభించిన వెంటనే ఈ సవరణ చట్టం అమల్లోకి రానుంది. ఇది అమల్లోకి వస్తే మాత్రం వారి భవిష్యత్తు ప్రశ్నార్ధకం కానుంది.
Also Read : తెలంగాణాలో టీడీపీ జోష్
సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో ఎంతలా రెచ్చిపోయినా.. పోలీసులు ఏమీ చేయలేరనే భావనతో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న వారికి ఈ చట్టంతో అడ్డుకట్ట వేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి వారందరినీ పోలీసులు గుర్తించి అరెస్ట్ లు చేస్తున్నారు. వారిపై కేసులు పెట్టి, దర్యాప్తు ముమ్మరం చేసారు. మానవ మృగాల్లా వ్యవహరించిన వర్రా రవీంద్రారెడ్డి, బోరుగడ్డ అనిల్ వంటి అనేక మంది వివరాలతో జాబితాను సిద్ధం చేసారు. త్వరలో దాదాపు 25 మందిపై పిడి యాక్ట్ పెట్టేందుకు పోలీసులు సిద్ధం అయ్యారు.