మాజీ మంత్రి పేర్ని నానీకి అధికారులు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. లెక్క తేల్చిన బియ్యానికి ఫైన్ కట్టండి అంటూ పేర్ని కుటుంబానికి నోటీసులు ఇచ్చారు. రేషన్ బియ్యం మాయం కేసులో మాజీ మంత్రి పేర్ని నాని సతీమణి జయసుధకు మరోసారి నోటీసులు ఇచ్చారు జాయింట్ కలెక్టర్. తొలుత 185 మెట్రిక్ టన్నులకు డబుల్ పెనాల్టీగా రూ.1.79 కోట్లు డీడీ కట్టించారు అధికారులు. పూర్తి స్థాయి విచారణ అనంతరం 378 మెట్రిక్ టన్నులకు షార్టేజీ పెరిగింది. పెరిగిన షార్టేజీకి కూడా ఫైన్ చెల్లించాలని నోటీసులు జారీ చ్చేసారు జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ.
Also Read : ఒక్కడ్ని కూడా వదలను.. పవన్ వార్నింగ్
అదనంగా రూ.1.67కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్న జేసీ.. మాజీ మంత్రి పేర్ని నానికి చెందిన సివిల్ సప్లయిస్ బఫర్ గోడౌన్ లో మాయమైన రేషన్ బియ్యం లెక్క తేల్చిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ చెల్లించాలని గోడౌన్ యజమానురాలు జయసుధకు నోటీసులలో స్పష్టంగా పేర్కొన్నారు. తొలుత 185 టన్నుల బియ్యం మాయమైనట్టు ప్రాథమికంగా గుర్తించిన అధికారులు అందుకు సంబంధించి డబుల్ పెనాల్టీ కింద రూ.1.70 కోట్లు ఫైన్ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మొత్తాన్ని లాయర్ల ద్వారా రెండు డీడీలుగా ఇప్పటికే చెల్లించారు.
Also Read : ఏపీ బియ్యం దొంగలపై కొత్త సిట్.. జాగ్రత్త పడ్డ సర్కార్…!
ఆ తర్వాత ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన అధికారులు మొత్తం 378 మెట్రిక్ టన్నులు షార్టేజీ వచ్చినట్టు గుర్తించి చర్యలకు దిగారు. షార్టేజీ వచ్చిన మొత్తం బియ్యానికి డబుల్ పెనాల్టీగా రూ.3.37కోట్లు జరిమానా అంటూ నోటీసులు పంపారు. గతంలో చెల్లించిన కోటి 70 లక్షలు మినహాయించి మిగిలిన రూ.1.67 కోట్లు చెల్లించాలని జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ గోడౌన్ యజమానురాలు పేర్ని జయసుధకు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసులు రద్దు చేయాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు మాజీ మంత్రి పేర్ని నాని.