రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫోన్ టాపింగ్ వ్యవహారం మరోసారి సంచలనం గా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తెలంగాణలో భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్న సమయంలో దీనిపై ఎక్కువగా ఆరోపణలు వినిపించాయి. ముఖ్యంగా తెలంగాణలో విపక్షాల ఫోన్లను ఎక్కువగా టాప్ చేశారు అనేది అప్పట్లో ప్రధాన ఆరోపణ. దీనిపై తెలంగాణలో అధికారం మారిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. ఇక ఏపీలో కూడా ఫోన్ టాపింగ్ జరిగింది అనేది మరో ఆరోపణ.
Also Read : వైసీపీలో ఊపు వస్తుందా.. సాధ్యమేనా..?
తెలంగాణలో ఉన్న అధికారుల సహకారంతో ఏపీలో ఫోన్ టాపింగ్ చేశారనేది అప్పట్లో కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఇక ఇజ్రాయిల్ నుంచి కొన్న ఒక టెక్నాలజీతో ఏపీలో కొన్ని ఫోన్లు టాప్ అయ్యాయి అనేది అప్పట్లో హడావుడి జరిగింది. అయితే ఇప్పుడు ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ టాప్ అయినట్లు బయటపడింది. వైఎస్ షర్మిల ఫోన్ సైతం టాప్ చేసినట్లు ఆధారాలతో సహా బయటపడింది. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బయటకు వస్తున్న కీలక విషయాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి..
Also Read : పిన్నెల్లికి జగన్ డైరెక్ట్ పోటు..?
అత్యంత గోప్యంగా షర్మిల మొబైల్స్ ట్యాప్ చేసినట్లు సమాచారం. షర్మిల కోసం కోడ్ భాష కూడా ఉపయోగించారని తెలుస్తోంది. వైసిపి అధికారంలో ఉన్న సమయంలో షర్మిల వాయిస్ రికార్డులు కూడా సేకరించినట్లు సమాచారం. ఎవరెవరితో మాట్లాడుతుంది అనే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ” అన్నకు “ సమాచారం ఇచ్చినట్లు గుర్తించారు. షర్మిల మాట్లాడే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచారు. షర్మిల దగ్గరి మనుషులను పిలిపించిన ఓ సీనియర్ పోలీస్ అధికారి..షర్మిల సన్నిహితులకు వార్నింగ్ ఇచ్చారట.తన ఫోన్లు ట్యాప్ అవుతున్నట్లు అప్పట్లోనే గుర్తించిన షర్మిల.. అనంతరం అప్రమత్తమయ్యారు. తన ఫోన్లు ట్యాప్ విషయంలో షర్మిల వద్ద కీలక సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. షర్మిల తో పాటుగా ఆమె కుటుంబ సభ్యుల ఫోన్స్ కూడా టాప్ అయినట్లు పోలీసులు గుర్తించారట.