Tuesday, October 28, 2025 04:21 AM
Tuesday, October 28, 2025 04:21 AM
roots

బాబు మంత్రివర్గంలో మార్పులు చేర్పులు..!

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది. వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని గాడీలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారు. అదే సమయంలో ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల అమలుపై కూడా దృష్టి పెట్టారు. సూపర్ సిక్స్ హామీల్లో ఇప్పటికే దీపం 2 కింద ఉచిత గ్యాస్ సిలెండర్లు, పింఛన్ పెంపు, మెగా డీఎస్సీ ప్రకటన చేశారు. ఇక మరో పది రోజుల్లోనే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలతో పాటు ఆగస్టు 15 నుంచి అమలు చేస్తున్నట్లు చంద్రబాబు స్వయంగా ప్రకటించారు. ఇక రాష్ట్రంలో పెట్టుబడుల రాకపై కూడా చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటికే టీసీఎస్ వంటి సంస్థలు భారీ పెట్టుబడులకు సిద్ధమయ్యాయి. ఇక అమరావతి, పోలవరం నిర్మాణాలు అనుకున్న సమయానికి పూర్తి చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

Also Read : జగన్‌కు బాబాయ్ షాక్..!

ఇక ఐదేళ్ల వైసీపీ పాలనలో భారీ ఎత్తున అవినీతి జరిగిన మాట బహిరంగ రహస్యం. లిక్కర్, మైనింగ్, ల్యాండ్ మాఫియాలు రెచ్చిపోయాయి. లిక్కర్ స్కామ్‌లో వేల కోట్ల అవినీతి జరిగిందనేది వాస్తవం. దీనిపై ఇప్పటికే కేసు నమోదు చేసిన ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. ఈ కేసులో కింగ్ పిన్ అరెస్టు తరువాయి అనే మాట వినిపిస్తోంది. ఇప్పటికే రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ్ రెడ్డిని అరెస్టు చేశారు. వీళ్లంతా ఇప్పుడు రిమాండ్‌లో ఉన్నారు. ఇక ఇటీవల పార్టీ మహానాడు కూడా గొప్పగా నిర్వహించింది తెలుగుదేశం పార్టీ. కడపలో ఘనంగా సాగిన మహానాడు వైసీపీ నేతల గుండెల్లో గుబులు రేపిందనే చెప్పాలి. ఇలాంటి సమయంలో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు అనే మాట బలంగా వినిపిస్తోంది.

Also Read : వైసీపీకి టీటీడి ఉద్యోగి ఊడిగం.. రెచ్చగొట్టి వీడియో రికార్డు

కూటమి పాలన ఏడాది పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మంత్రివర్గంలో మార్పులు తప్పవనే మాట ఇప్పుడు పార్టీలో ఆసక్తి రేపుతోంది. మంత్రివర్గంలో ఇప్పటికీ ఒక స్థానం ఖాళీగా ఉంది. దాని కోసం టీడీపీ, జనసేన పార్టీల నేతలు గట్టిగానే పట్టుబడుతున్నారు. టీడీపీ తరఫున పల్లా శ్రీనివాసులు, జనసేన తరఫున నాగబాబు పేరు వినిపిస్తున్నాయి. నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చిన వెంటనే మంత్రివర్గంలోకి తీసుకుంటారనే మాట బలంగా వినిపించింది. కానీ జనసేన పార్టీ ఆవిర్భావ సభలో నాగబాబు చేసిన వ్యాఖ్యలు కూటమి నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీశాయి కూడా. దీంతో నాగబాబు పదవికి గండం వచ్చింది. ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. మంత్రిపదవి మాత్రం రాలేదు.

Also Read : ఉక్రెయిన్ మాస్టర్ మైండ్.. ఒక్క అటాక్ తో రష్యాకు షాక్.. అమెరికాకు వార్నింగ్

ఏడాది పాలన పూర్తి చేసుకున్న ప్రభుత్వంలో.. కొన్ని మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకరిద్దరు మంత్రులను తొలగిస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాలకు చెందిన మంత్రుల పేర్లు బాగా వినిపిస్తున్నాయి. ఉత్తరాంధ్రకు చెందిన వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్‌, గుమ్మడి సంధ్యారాణి ప్రస్తుత క్యాబినెట్‌లో ఉన్నారు. వీరిలో అచ్చెన్నాయుడు ఐదేళ్లు కొనసాగుతారని పార్టీ నేతలే చెబుతున్నారు. ఇక కొండపల్లి శ్రీనివాస్‌కు ముఖ్యమంత్రి దగ్గర మంచి మార్కులే ఉన్నాయి. వేటు పడే నేతల్లో అనిత పేరు బాగా వినిపిస్తోంది. ఆమెపై పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికే పీఏ జగదీష్‌ గురించి స్వయంగా ఆమె వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.

Also Read : జగన్ 2.0.. భయపడుతున్న జనం..!

ఇక మహానాడు సక్సెస్ తర్వాత రెడ్డప్పగారి మాధవీరెడ్డి గురించి విస్తృతంగా చర్చ నడుస్తోంది. మాధవీరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అటు జనసేన కూడా తమకు మరో మంత్రి పదవి కావాలని కోరుతోంది. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రిగా కందుల దుర్గేష్ మంత్రివర్గంలో ఉన్నారు. వీరితో పాటు మరో నేతకు కూడా పదవి ఇవ్వాలనేది జన సైనికుల డిమాండ్. ప్రముఖంగా నాగబాబు పేరు వినిపిస్తోంది. వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో ఆగస్టు సెంటిమెంట్ ఉంది. ఆగస్టు యాంటీ సెంటిమెంట్ నేపథ్యంలో మార్పులు చేర్పులు చేస్తారా అనే ప్రశ్న వినిపిస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్