ఏపీ బడ్జెట్ ను ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో కీలక వ్యాఖ్యలు చేసారు పయ్యావుల. గత ప్రభుత్వ తప్పిదాలను.. నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఎండగట్టిన ఆర్థిక మంత్రి… వైసీపీ ప్రభుత్వ ఆర్థిక అరాచకత్వాన్ని హిరోషిమాపై అణుదాడితో పోల్చడం గమనార్హం. తమ పిల్లల భవిష్యత్ కోసం 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని చంద్రబాబు తొలిసారి సీఎం అయినప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండేవో.. ఇప్పుడూ అంతకు మించిన స్థాయిలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయన్నారు. అప్పులు చేయడమే తప్ప.. అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వ తప్పుడు విధానాలను సరి చేస్తున్నామని పేర్కొన్నారు.
Also Read : జగన్‌కు ఝలక్ ఇవ్వనున్న ఎమ్మెల్సీ..!
వైసీపీ పాలనలో కాంట్రాక్టర్లే రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టారని కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు జరపకపోవడంతో అభివృద్ధి పనులు చేయడానికి కాంట్రాక్టర్లు గత ప్రభుత్వంలో ముందుకు రాలేదన్నారు. బడ్జెట్ లెక్కలు ఒకసారి పరిశీలిస్తే… 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.322359 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. తొలిసారి రూ. 3 లక్షలు కోట్లు దాటింది రాష్ట్ర బడ్జెట్. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలకు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపాల్సి రావడంతో రూ. 3 లక్షల కోట్లు దాటింది. రెవెన్యూ వ్యయం రూ. 251162 కోట్లు కాగా రెవెన్యూ లోటు రూ. 33185 కోట్లుగా ఉంది. ద్రవ్య లోటు రూ. 79926 కోట్లు,మూల ధన వ్యయం రూ.40635 కోట్లుగా ప్రకటించారు.
Also Read : పోసాని రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మార్గదర్శకత్వంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తున్నామని నాటి ప్రభుత్వ అరాచక విధానాలపై అమరావతి రైతులు పోరుబాటను ఎంచుకున్నారన్నారప. తమను తాము కాపాడుకుంటూ రాష్ట్ర రాజధానిని కూడా కాపాడుకునేలా అమరావతి రైతులు చేసిన పోరాటాన్ని మరువలేమని రాజధాని పనులు త్వరలో ప్రారంభం కాబోతున్నాయన్నారు. అన్నదాత సుఖీభవ కింద ప్రతి రైతుకు రూ. 20 వేలు ఇచ్చేలా కేటాయింపులు చేస్తున్నామని.. తల్లికి వందనం పథకం కింద కుటుంబంలో చదువుకునే ప్రతి విద్యార్థికి రూ. 15 వేలు ఇస్తామన్నారు.
Also Read : కృష్ణమ్మ నీళ్ళ పంచాయితీ తేలినట్టేనా…?
ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లల్లో చదివే విద్యార్థులకు తల్లికి వందనం వర్తిస్తుందని తెలిపారు. 1-12వ తరగతుల విద్యార్థులకు తల్లికి వందనం స్కీం వర్తింపు చేస్తామని విద్యార్థుల తల్లుల ఖాతాలో తల్లికి వందనం డబ్బులను జమ చేస్తామన్నారు. స్కూళ్లు తెరిచే నాటికి తల్లికి వందనం పథకం అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసామన్నారు. ఎటువంటి జాప్యం లేకుండా.. కార్పోరేట్ వైద్యం అందేలా హెల్త్ ఇన్సూరెన్స్ పథకం అమలుపై బడ్జెట్టులో ప్రస్తావించారు. ఈ ఏడాదిలోనే రూ. 25 లక్షలతో ప్రతి కుటుంబానికి ఆరోగ్య బీమా పథకం అమలు చేస్తామని తెలిపారు. ఎన్టీఆర్ వైద్య సేవను కొనసాగిస్తూనే ఆరోగ్య బీమా పథకం అమలు చేయనున్నట్టు బడ్జెట్టులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని తెలిపారు.




