Saturday, September 13, 2025 09:07 AM
Saturday, September 13, 2025 09:07 AM
roots

సారీ అన్న… నేను కూడా పోతున్నా… మరో మహిళా నేత క్లారిటీ..!

వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి వరుస షాకులు తగులుతున్నాయి. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా ప్రజలు ఓటుతో తీర్పు చెప్పారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నెలలోనే కీలక నేతలంతా జగన్ కు ఝలక్ ఇచ్చారు. నీతో ప్రయాణం మా వల్ల కాదంటూ తెగదెంపులు చేసుకున్నారు. దగ్గరి బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు అత్యంత సన్నిహితంగా మెలిగిన ఆళ్ల నాని వంటి నేతలు కూడా మా వల్ల కాదని తేల్చేశారు. ఇప్పుడు అదే బాటలో మరో మహిళా నేత కూడా జగన్ కు బై బై చెప్పేందుకు సిద్ధమయ్యారు.

మాజీ హోం మంత్రి మేకతోటి సుచరిత పార్టీ మారుతారనే పుకార్లు వినిపిస్తున్నాయి. 2006లో తొలిసారి జెడ్పీటీసీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ మరణానంతరం జగన్ కు మద్దతుగా రాజీనామా చేసి 2011 బై ఎలక్షన్ లో పోటీ చేసి గెలిచారు సుచరిత. ఆ తర్వాత 2014లో ఓడినప్పటికీ… 2019లో గెలవడంతో ఏకంగా హోం మంత్రి పదవి దక్కింది. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ లో భాగంగా సుచరితను పదవి నుంచి తప్పించారు జగన్. దీంతో కొద్ది రోజుల పాటు రాజకీయాలకు దూరంగా కూడా ఉన్నారు. అప్పట్లోనే పార్టీ మారుతారనే పుకార్లు షికారు చేశాయి. అయితే జగన్ స్వయంగా బుజ్జగించటంతో కాస్త మెత్తబడ్డారు.

Also Read :పాపం… ఆయన మాట లెక్కచేయని సీనియర్లు…!

అయితే ఎన్నికల వరకు సైలెంట్ గా ఉన్న జగన్.. సుచరితకు ఊహించని షాక్ ఇచ్చారు. చివరి నిమిషంలో ప్రత్తిపాడు కాదని రాజధాని పరిధిలోని తాడికొండ నియోజకవర్గం టికెట్ కేటాయించారు. దీంతో చేసేది లేక సైలెంట్ అయ్యారు సుచరిత. ఓటమి ఖాయమని ముందే తెలుసుకున్న మాజీ హోం మంత్రి.. ఎన్నికల్లో మొక్కుబడి ప్రచారంతో సరిపెట్టారు. ఇక ఓటమి తర్వాత రాజకీయాలకు దూరమయ్యారు కూడా. చివరికి గత ప్రభుత్వంలో శాంతిభద్రతలపై కూటమి సర్కార్ శ్వేత పత్రం విడుదల చేసినప్పుడు కూడా కనీసం స్పందించలేదు. ఇక గుంటూరు జిల్లాలో అధినేత జగన్ రెండుసార్లు పర్యటించినప్పుడు కూడా మేడం జాడ లేదు. దీంతో మార్పు ఖాయమని అంతా ఫిక్స్ అయ్యారు.

Also Read :చంద్రబాబు సంచలన నిర్ణయం..!

ఇక ఐదు నెలలుగా అందరికీ దూరంగా ఉంటున్న సుచరిత రెండు రోజుల క్రితం సైలెంట్ గా అధినేత జగన్ తో భేటీ అయినట్లు తెలుస్తోంది. ఈ భేటీలో అన్నా నన్ను మన్నించు… ఇక మీతో కలిసి ప్రయాణం చేయలేను అని తేల్చిచెప్పారట. దీంతో ఖంగుతిన్న జగన్.. మీకేం తక్కువ చేశానని ఎదురు ప్రశ్నించారట. మళ్లీ ప్రత్తిపాడు నియోజకవర్గం బాధ్యతలు చేపట్టాలని కోరారట. అయితే మేకతోటి సుచరిత మాత్రం.. సారీ అన్న… నేను కూడా పోతున్నా అంటూ తెగేసి చెప్పినట్లు తెలుస్తోంది. మొదటి నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డితో సన్నిహిత సంబంధాలున్న సుచరిత… త్వరలోనే ఆయన బాటలోనే జనసేన పార్టీలో చేరుతారనే పుకార్లు ఇప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో జోరుగా వినిపిస్తున్నాయి. మరికొందరేమో… హోం మంత్రి పదవి పోయినప్పుడే పార్టీ మారినట్లైతే… ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్ లేదా ఉండవల్లి శ్రీదేవికి వచ్చినట్లు కార్పోరేషన్ ఛైర్మన్ పదవి దక్కేది కదా అని కూడా అంటున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్