ఆంధ్రప్రదేశ్ లో వరుసగా సంక్షేమ కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వం వెంట వెంటనే ప్లాన్ చేస్తుంది. సూపర్ సిక్స్ హామీలుపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైసీపీకి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా గేమ్ స్టార్ట్ చేస్తున్నారు. ఆర్థిక వెసులుబాటు వచ్చేవరకు ఎదురుచూసిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు వరుసగా సంక్షేమ కార్యక్రమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. తల్లికి వందనం కార్యక్రమం పై ప్రజల్లో సానుకూల అభిప్రాయం రావడంతో వైసిపి సైలెంట్ అయిపోయింది.
Also Read : పారిపోవడానికి సిద్ధంగా వైసీపీ నేతలు..? చెవిరెడ్డితో స్టార్ట్ అయిందా..?
దీనిపై విమర్శలు చేసే ప్రయత్నం చేసిన సరే అది వర్కౌట్ కాలేదని చెప్పాలి. ఇక ఇప్పుడు మరో సంక్షేమ కార్యక్రమానికి చంద్రబాబు ప్లాన్ చేశారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు 1500 ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతోంది. దీనికి సంబంధించి 3000 కోట్ల రూపాయలను చంద్రబాబు సర్కార్ సమీకరించింది. ఈ నిధులు మొత్తాన్ని ఆగస్టు 15 లేదంటే ఈలోపునే జమ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ కార్యక్రమం పై కూడా వైసీపీ సోషల్ మీడియాలో విమర్శలు చేస్తూ వస్తుంది. అందుకే ప్రభుత్వ పెద్దలు దీనిపై గురిపెట్టారు.
Also Read : అవును.. వీళ్లంతా జర్నలిస్టులు..!
మహిళా ఓటు బ్యాంకు మీద ఎక్కువ దృష్టి సారించిన చంద్రబాబు సర్కార్.. ఈ సంక్షేమ కార్యక్రమం కూడా అమలు చేస్తే వైసీపీ విమర్శలు చేయడానికి పెద్దగా అవకాశం ఉండదని భావిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. దీనితోపాటుగా నిరుద్యోగ భృతి విషయంలో కూడా చంద్రబాబు సర్కార్ త్వరలోనే నిర్ణయం తీసుకునే సంకేతాలు కనపడుతున్నాయి. ఇక త్వరలోనే అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సైతం సర్కార్ రెడీ అవుతోంది. ఇలా 2025ను సంక్షేమ ఏడాదిగా మార్చేందుకు ప్రణాళికలు రెడీ చేసుకుని రంగంలోకి దిగుతున్నారు. దీనితోపాటుగా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కూడా గట్టిగానే ఫోకస్ పెడుతుంది కూటమి సర్కార్.