ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వంలో కొందరు అధికారులు పాల్పడిన అవినీతి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక్కో అధికారి ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో కోట్ల రూపాయలు దోచుకున్నారు. అందులో గనుల వెంకటరెడ్డి ముందు వరుసలో ఉంటారు. ఆయన చేసిన అవినీతిపై అప్పట్లో తీవ్ర స్థాయిలో ఆరోపణలు వచ్చాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు కచ్చితంగా మూడుతుందని చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఈ నేపధ్యంలో తాజాగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై మరో కేసు నమోదు అయింది.
Also Read :నానీని కాపాడుతుంది ఎవరూ…? తిట్టినా పౌరుషం రాదెం…?
ఒకట్రెండు రోజుల్లో ఏసీబీ ఎఫ్ఎఆర్ దాఖలు చేయనుంది. జగనన్న సర్వే రాళ్ల కటింగ్ పేరిట 100 కోట్లు కొట్టేసేందుకు స్కెచ్ వేసినట్టు గుర్తించారు. చైనా యంత్రాలు తెప్పించేలా బినామీ సంస్థతో పక్కా ప్లాన్ వేసారని కోటి టర్నోవర్ కూడా లేని ధన్వంతరికి 160 కోట్ల టెండర్ అడ్డగోలుగా నిబంధనల ఉల్లంఘనతో అనుమతులు ఇచ్చారని గుర్తించారు. ప్రాథమిక విచారణలో కీలక ఆధారాలు సేకరించారు. గనుల టెండర్లు, ఇసుక తవ్వకాల్లో భారీ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటరెడ్డి ఇప్పటికే జైలు కెళ్ళి బెయిల్ పై విడుదల అయ్యారు.
Also Read :జగన్ పై తెలంగాణా మంత్రుల స్పెషల్ లవ్… ఈ నోటి దూల అందుకేనా…?
నిబంధనలకు భిన్నంగా తన సన్నిహితుడి కంపెనీకి 160 కోట్ల టెండర్ ఇచ్చారు. దీనికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించింది అవినీతి నిరోధక శాఖ. కేసు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేసారు. ఒకటి, రెండు రోజుల్లో వెంకటరెడ్డితో పాటు ఆయన బినామీ సంస్థగా ఏ అనుమానిస్తున్న ధన్వంతరి అసోసియేట్స్ పై కేసు పెట్టి చట్టపరమైన చర్యలకు సిద్ధం కానున్నారు. జగనన్న భూరక్ష పేరుతో గ్రామాల్లోని పొలాల సరిహద్దుల్లో రీ సర్వే రాళ్ల పాతి, వాటిపై జగన్ బొమ్మలు వేసేలా అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. తక్కువ ధరలకు ఇక్కడ లభించే ఒక్కో రాళ్ల కటింగ్ మిషన్ ను చైనా నుంచి రూ.3 కోట్లకు కొనేందుకు సిద్ధమయ్యారు.