ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిన తర్వాత చోటు చేసుకుంటున్న పరిణామాలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి. బయటకు వస్తున్న అక్రమాలు అన్నింటిని ఇప్పుడు ప్రజలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. సిఎం చంద్రబాబు ఒక్కో అక్రమాన్ని బయట పెట్టే పనిలో పడ్డారు. పలు శాఖలపై ఆయన ఇప్పటికే శ్వేత పత్రాలను కూడా విడుదల చేయడం మనం చూశాము. ఇక త్వరలోనే మరిన్ని శాఖలపై, అందులో జరిగిన అవినీతి పై శ్వేత పత్రాలను విడుదల చేసే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.
ఇక పోలవరం ప్రాజెక్ట్ తో పాటుగా మరిన్ని ప్రాజెక్టుల్లో జరిగిన అక్రమాలను సైతం బయట పెట్టేందుకు ప్రభుత్వం సిద్దమవుతుంది. అక్కడి వరకు బాగానే ఉంది గాని ఇప్పుడు నకిలీ పత్రాలతో సహకార బ్యాంకులను కొందరు వైసీపీ నేతలు మోసం చేసి లోన్లు తీసుకున్నారని ప్రభుత్వం గుర్తించినట్టుగా వార్తలు వస్తున్నాయి. సహకార బ్యాంకులలో నకిలీ పత్రాలను సృష్టించి ప్రభుత్వ భూములను చూపించి బ్యాంకు మేనేజర్లకు లంచాలు ఇచ్చి భారీ మొత్తంలో లోన్లు తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై ఇప్పుడు ప్రభుత్వం దృష్టి సారించింది.
ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, రాయలసీమ జిల్లాల్లో ఈ అక్రమాలు ఎక్కువగా జరిగినట్టు సమాచారం. అలాగే చిత్తూరు జిల్లాలో ఏకంగా ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా భారీగా లోన్లు తీసుకున్నారని సమాచారం. వారికి ఒక మాజీ మంత్రి సహకరించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి. దీనిపై త్వరలోనే సర్కార్ దృష్టి పెట్టి కొంత మంది బ్యాంకు మేనేజర్ల మీద కూడా కేసులు పెట్టె అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములకు రిజిస్ట్రేషన్లు చేసిన ఎమ్మార్వోల మీద కూడా ప్రభుత్వం గురి పెట్టినట్టు సమాచారం.

