Friday, September 12, 2025 11:16 PM
Friday, September 12, 2025 11:16 PM
roots

వైసీపీ పాపాలు: తిరుమల ప్రసాదంలో జంతువుల కొవ్వు

గత అయిదేళ్లుగా తిరుమల పవిత్రత విషయంలో ఎన్నో విమర్శలు వచ్చాయి. ప్రపంచంలోనే ప్రసిద్ది చెందిన ఆలయంగా ఉన్న తిరుమల విషయంలో వైసీపీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని టీడీపీ ఎన్నో ఆరోపణలు చేసింది. భక్తుల మనోభావాలకు ఏ మాత్రం విలువ ఇవ్వకుండా ప్రవర్తించడం పట్ల భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేసారు. చివరకు ప్రసాదం విషయంలో కూడా రాజకీయం చేసింది అప్పటి జగన్ ప్రభుత్వం. భక్తులకు అన్నదానం చేసే విషయంలో సైతం ప్రభుత్వం చర్యలు, బోర్డు చర్యలు విమర్శలకు దారి తీశాయి అప్పట్లో.

Read Also : ఆచరణలోకి వచ్చిన లోకేష్ సంచలన హామీ

ఇక ప్రసాదం అయితే విలువ తగ్గించే విధంగా ఉత్పత్తి పెంచి వికృత చర్యలకు పాల్పడ్డారు. తాజాగా ప్రసాదం విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా గత పాలకులు అపవిత్రం చేశారన్నారు చంద్రబాబు నాయుడు. నాసిరకమైన సరుకులు వాడడమే కాకుండా నేతి బదులు యానిమల్ ఫ్యాట్ (జంతు నూనె) కూడా వాడారని తెలిసిందని చంద్రబాబు వ్యాఖ్యలు చేసారు. ఇది తెలిసి ఆందోళన చెందానన్న ఆయన ప్రభుత్వం వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి వాడుతున్నామని పేర్కొన్నారు.

కేబినేట్ భేటీ సందర్భంగా చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలు మంత్రుల్లో ఆందోళన, ఆశ్చర్యం వ్యక్తం అయింది. ఇక పలు కీలక విషయాల మీద కూడా చంద్రబాబు మాట్లాడారు. వరదల సహాయ చర్యల కోసం 350 కోట్ల సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చిందన్నారు చంద్రబాబు. ఇదొక చరిత్ర అని పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరి ఒప్పుకుంటే ఎమ్మెల్యేలు అందరం ఒక నెల జీతం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఇద్దామని పిలుపునిచ్చారు. ప్రపంచం అంతా స్పందించింది అని కొనియాడారు చంద్రబాబు. ఇక పేదలు అందరికి పక్కా ఇల్లు కట్టించే బాధ్యత తీసుకుంటాం అన్నారు చంద్రబాబు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్