Friday, October 24, 2025 11:06 AM
Friday, October 24, 2025 11:06 AM
roots

టిడిపితో పొత్తులో భాగంగా జనసేన పోటీ చేసే స్థానాలు ఇవే

ఏపీలో రాజకీయం రోజురోజుకి వేడెక్కుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారం వ్యూహం, మ్యానిఫెస్టో ఖారారు వంటి అంశాల పై దృష్టి సారించాయి. రాష్ట్రంలో పొత్తులపై దాదాపు ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. టీడీపీ, జనసేన పొత్తు ఇక అధికారకమే. కేవలం అధికారికంగా ప్రకటించడం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే పోటీ చేసే స్థానాల పై కూడా పూర్తిస్థాయిలో చర్చలు జరిగినట్లు సమాచారం. పవన్ గతంలో చెప్పినట్లుగా పొత్తుల గురించి ఇప్పుడు వారాహి యాత్రలో ప్రస్తావన చేయకపోయినా.. పక్కా వ్యూహంతోనే అడుగులు పడుతున్నాయి. పొత్తుల పై, పోటీ చేసే స్థానాల పై పవన్ మరియు చంద్రబాబుకి పూర్తి అవగాహనా ఉందని అంతర్గత సమాచారం.

ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు.. మొత్తంగా మాత్రం 22-25
అసెంబ్లీ సీట్ల వరకు ఇచ్చేనందుకు టీడీపీ అంగీకరించినట్లు విశ్వసనీయ సమాచారం. పవన్ తాను చేయించుకున్న సర్వేల ఆధారంగా ఇప్పుడు పోటీ చేయబోయే సీట్లలోనే వారాహి యాత్ర కొనసాగిస్తున్నారు. టీడీపీ, జనసేన పొత్తుతో సీట్ల పంపకాల పైన రెండు పార్టీల్లోనూ ఉత్కంఠ కొనసాగుతోంది. టీడీపీలో ఎంతో కాలంగా పని చేస్తున్న సీనియర్లు ఎవరు సీట్లు పొత్తులో భాగంగా కోల్పోవాల్సి వస్తుందనే టెన్షన్ వెంటాడుతోంది.

ప్రధానంగా గోదావరి జిల్లాల్లో ఈ పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటి వరకు తాము టీడీపీతో సీట్ల చర్చలు చేయలేదని జనసేనాని స్పష్టం చేశారు. అదే సమయంలో పవన్ కల్యాణ్ పలు సర్వేలు చేయించారు. తనతో సహా తన పార్టీకి పట్టున్న నియోజకవర్గాల గురించి పూర్తి సమాచారం సేకరించారు. ఆ జాబితా ఆధారంగానే టిడిపి సలహాలు, సూచనలతోనే వారాహి రూట్ మ్యాప్ ఖరారు అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు పోటీ చేసే సీట్ల పైన జాబితాకు టీడీపీ నో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది.

పొత్తులో భాగంగా జనసేన.. శ్రీకాకుళం జిల్లాలో ఒక స్థానం కోరుతోంది. విజయనగరం జిల్లాలో మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. విశాఖ నగరం నుంచి తిరిగి గాజువాక జనసేన పోటీ చేయనుంది. అదే విధంగా రూరల్ ప్రాంతంలోని మాడుగుల పైన చర్చ జరుగుతోంది. వారాహి యాత్ర ఇప్పటికే పూర్తయిన పిఠాపురం, కాకినాడ రూరల్, పి.గన్నవరం, రాజోలు తో పాటుగా అమలాపురం నుంచి జనసేన బరిలో నిలిచే అవకాశం కనిపిస్తోంది. రాజానగరం పైన స్పష్టత రావాల్సి ఉంది.

పశ్చిమ గోదావరిలో భీమవరం, నర్సాపురం, తాడేపల్లి గూడెం, నిడదవోలు జనసేకు ఖాయమైనట్లు సమాచారం. అదే విధంగా.. అవనిగడ్డ, పెడన, కైకలూరు జనసేకు ఇచ్చేందుకు అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ నుంచి వంగవీటి రాధా పోటీ ఖాయమని సమాచారం. గుంటూరు జిల్లాలో తెనాలి.. గుంటూరు పశ్చిమం పైన రెండు పార్టీల నుంచి డిమాండ్ ఉంది. ప్రత్తిపాడు జనసేనకు కేటాయించే ఛాన్స్ కనిపిస్తోంది.

దర్శి నుంచి జనసేన బరిలోకి దిగనుంది. నెల్లూరు సిటీ.. తిరుపతి తో పాటుగా రాజంపేట జనసేకు కేటాయిస్తారని తెలుస్తోంది. రెండు పార్టీల కేడర్ ను ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలో భాగంగా మందుగానే సీట్ల పైన నిర్ణయానికి రావాలని భావిస్తున్నట్లు సమాచారం. జనసేనకు మూడు ఎంపీ స్థానాలు ఇస్తారని సమాచారం. అందులో కాకినాడ, నర్సాపురం, మచిలీపట్నం పైన చర్చ జరుగుతోంది. జనసేన నుంచి మరిన్ని సీట్ల కోసం డిమాండ్ ఉన్నా.. టీడీపీ నుంచి పోటీ ఉండటంతో అంతకంటే ఎక్కువ స్థానాలు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తుంది. ఏది ఏమైనా అతి తొందరగా ఫైనల్ లిస్టు ఖరారు చేయాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

టీడీపీలో వారికి గ్యారంటీ...

తెలుగుదేశం పార్టీ అనగానే ముందుగా అందరికీ...

కొలికపూడి వర్సెస్ కేసినేని.....

తిరువూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు...

త్వరలో మంత్రివర్గంలో భారీ...

ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా...

బ్రేకింగ్: తుని ఘటనలో...

గత రెండు రోజుల నుంచి అత్యంత...

దానం చుట్టూ మరో...

దానం నాగేందర్.. తొలి నుంచి వివాదాలు...

నా తండ్రికి ఆమె...

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక రోజు...

పోల్స్