2024 ఏడాది ముగింపు దశకు చేరుకున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఓ మైలురాయిగా ఈ ఏడాది మిగిలిపోయింది. స్కిల్ కేసులో చంద్రబాబు అరెస్టు, విడుదలతో 2023 ఏడాది పొలిటికల్ హిస్టరీలోనే ఓ బిగ్ టర్న్‌కు కారణమైంది. 2024 ఏడాది ప్రారంభం నుంచి ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు జరుగుతూనే ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కూటమిగా ఏర్పాటయ్యాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా మిగిలిపోయింది. ఎన్నికలకు ముందే వైఎస్ కుటుంబంలో విబేధాలు తారాస్థాయికి చేరుకున్నాయి. సొంత చెల్లెలు వైఎస్ షర్మిల వైసీపీ అధినేతపై తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేశారు.
Also Read : తగ్గేదె లే అంటున్న మెగా – అల్లు ఫ్యామిలీస్…!
2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత టార్గెట్ టీడీపీ అన్నట్లుగా జగన్ సర్కార్ పని చేసింది. అక్రమ కేసులు, అరెస్టులు, వేధింపులు, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననం అన్నట్లుగానే వైసీపీ సర్కార్ పని చేసింది. చివరికి చంద్రబాబు అరెస్టుతో వైసీపీ అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. వై నాట్ 175 అనే నినాదంతో జగన్ సిద్ధం సభలు నిర్వహించారు. అదే సమయంలో ప్రతిపక్ష నేతలు నామినేషన్ దాఖలుకు కూడా ఇబ్బందులు సృష్టించారు.
Also Read : జగనన్నను కార్యకర్తలే వద్దంటున్నారా…..?
ఇక మే 13న జరిగిన ఎన్నికల్లో ఏపీ ప్రజలు పెద్ద ఎత్తున తమ విలువైన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రికార్డు స్థాయిలో ఏకంగా 83 శాతం ఓటింగ్ నమోదైంది. ఇక జూన్ 4 వచ్చిన ఎన్నికల ఫలితాల్లో కూటమి సర్కార్ బంపర్ మెజారిటీ సాధించింది. గతంలో 151తోనే వైసీపీ నేతలు గ్రేట్ అని ప్రచారం చేసుకోగా… కూటమి సర్కార్ ఏకంగా 164 స్థానాలను గెలుచుకుంది. ఇక కేవలం 11 స్థానాలు మాత్రమే రావడంతో… జగన్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మర్నాటి నుంచి అసెంబ్లీకి కూడా రాలేదు. ప్రతిపక్షమే అవసరం లేదన్న జగన్.. చివరికి అదే ప్రతిపక్ష హోదా కోసం హైకోర్టు మెట్లు ఎక్కారు. ఐదేళ్ల అరాచక పాలనకు 2024 ఎన్నికలు ముగింపు పలికాయని… దీంతో ఏపీ ముఖచిత్రమే మారిపోయిందనేది రాజకీయ విశ్లేషకుల మాట.