కాంట్రవర్షియల్ కామెంట్స్ చేసే విషయంలో యాక్టర్ కమ్ యాంకర్ అనసూయ ఈ మధ్యకాలంలో కాస్త చెలరేగిపోతోంది. ఈ మధ్యకాలంలో ఆమె చేస్తున్న కామెంట్స్ పై విమర్శలు వస్తున్నాయి. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె అమ్మాయిలు, అబ్బాయిల మధ్య ఎట్రాక్షన్ అనేది చాలా కామన్ అని… వయసుతో సంబంధం లేదని, ఏ రంగంలోనైనా సరే చాలా కామన్ గా మారిపోయిందని, అయితే అవకాశాల పేరుతో వాడుకోవడానికి చాలామంది హీరోలతో పాటు డైరెక్టర్లు, నిర్మాతలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారని అనసూయ కామెంట్ చేసింది.
Also Read : వైసీపీకి చావు దెబ్బ.. బాలినేని రివేంజ్ మోడ్..?
తన విషయంలో కూడా ఇలాంటివి చాలానే జరిగాయని, ఒక స్టార్ హీరో కమిట్మెంట్ అడిగితే డైరెక్ట్ గా నేను నో చెప్పానని ఆమె వ్యాఖ్యలు చేసింది. అలాగే ఒక పెద్ద డైరెక్టర్ ప్రపోజల్ విషయంలో కూడా తాను నో చెప్పినట్లు అనసూయ వ్యాఖ్యలు చేసింది. అలా చెప్పడం వల్ల ఆఫర్లు తన వరకు రాలేదని… వాళ్ళు రానివ్వలేదని కామెంట్ చేసింది. నో చెప్పడమే కాదు అలా చెప్పడం వల్ల వచ్చే సమస్యలను ఎదుర్కొనే ధైర్యం కూడా అమ్మాయిలకు ఉంటే మంచిదని తన ఒపీనియన్ షేర్ చేసుకుంది.
Also Read : సీఎం చంద్రబాబే.. చీఫ్ మాత్రం పెద్దిరెడ్డి.. చిత్తూరులో వింత…!
ఇలాంటి వాటికన్నా కళను, మనలో ఉన్న టాలెంట్ ను చూసి పాత్రలు ఇస్తే చాలా బెటర్ అని, ఆమె రాకపోతే ఏం… ఈ క్యారెక్టర్ అయితే బాగా చేస్తుంది కదా అని అనుకున్నప్పుడు ఛాన్స్ వస్తే బాగుంటుందని… అలాంటప్పుడే చాలామంది అమ్మాయిలు ఈ రంగంలోకి అడుగు పెడతారని అనసూయ కామెంట్ చేసింది. పది మంది తప్పు చేస్తున్నారు కదా అని తాను కూడా తప్పు చేస్తాను అనడం కరెక్ట్ కాదని, ఈజీ వే లో కాకుండా కష్టాన్ని, నమ్ముకుని ప్రయత్నం చేస్తే మంచిదని అనసూయ వ్యాఖ్యలు చేసింది. సోషల్ మీడియాలో తాను షేర్ చేసే ఫోటోలు తన ఇష్టమని తన విషయంలో ఎవరు జోక్యం చేసుకోవడానికి అధికారం లేదని ఘాటుగా రియాక్ట్ అయింది.