Friday, September 12, 2025 07:29 PM
Friday, September 12, 2025 07:29 PM
roots

పవన్ ఫాన్స్ లో జోష్ నింపిన అనసూయ మాటలు

జబర్దస్త్ ద్వారా బుల్లి తెరపై బిజీ అయిన యాంకర్ అనసూయ, రంగస్థలం సినిమా ద్వారా వెండితెరలో బిజీ అయిపోయారు. ఇక వరుస ఆఫర్లతో ఈ యాంకరమ్మ దూసుకుపోతున్నారు అనే చెప్పాలి. ప్రస్తుతం ఆమె నాలుగు సినిమాలకు సైన్ చేసిందని కృష్ణా నగర్ వర్గాలు అంటున్నాయి. అలాగే బుల్లి తెరపై కూడా ఈ యాంకర్ పలు డాన్స్ షో ల ద్వారా సందడి చేస్తుంది. పుష్ప సినిమాతో లేడీ విలన్ ఆఫర్లు సైతం ఈ యాంకర్ కు వచ్చినట్టుగా ప్రచారం జరుగుతుంది. ఆ సినిమాలో ఆమె క్యారెక్టర్ దాదాపుగా అలాగే ఉంటుంది.

సునీల్ కు భార్యగా కనపడిన ఆమె రెండో భాగంలో నటనలో విశ్వరూపం చూపిస్తుంది. ఇక పుష్ప 2 లో ఆమె ఎలా ఉంటుంది ఏంటీ అనేది మాత్రం స్పష్టత రావడం లేదు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె నుంచి వచ్చిన ఒక ప్రకటన ఆమె ఫాన్స్ తో పాటుగా బుల్లి తెర వీక్షకుల్లో కూడా ఒక జోష్ నింపింది అనే చెప్పాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక ఐటెం డాన్స్ చేసానని ఆ పాట టీవీల్లో మోత మోగిపోవడం ఖాయం అని ఆమె ఒక షోలో ప్రకటించారు. ఈ విషయాన్ని మొదటి సారి చెప్తున్నానని చెప్పడానికి ఎంతో గర్వంగా ఉందన్నారు ఆమె.

ఇక పవన్ కళ్యాణ్ తో కలిసి ఆమె ఏ సినిమాలో డాన్స్ చేసారనేది మాత్రం చెప్పలేదు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు. అందులో ఐటెం సాంగ్ ఏదైనా ఆమె చేసారా లేక మరే ఇతర పాటకు అయినా డాన్స్ చేసి ఉండవచ్చా అంటూ సోషల్ మీడియాలో చర్చలు ఊపందుకున్నాయి. ఉస్తాద్ భగత్ సినిమాలోనే అయి ఉండే ఛాన్స్ ఉందని, హరీష్ శంకర్ ఈమెతో గతంలో చర్చలు కూడా జరిపారని అంటున్నారు. ఏ సినిమా ఏంటీ అనేది చిత్ర యూనిట్ బయటపెడితే లేదా అనసూయ వెల్లడిస్తే గాని తెలిసే అవకాశం లేదు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

పోల్స్