Saturday, September 13, 2025 01:29 AM
Saturday, September 13, 2025 01:29 AM
roots

కాస్టింగ్ కౌచ్ పై మహిళా జర్నలిస్ట్ గూబ గుయ్యమనిపించిన అనన్య

క్యాస్టింగ్ కౌచ్, నేపోటిజం… ఇండియన్ సినిమాలో ఈ రెండు మాటలకు ఉన్న ప్రాధాన్యత ప్రపంచంలో ఏ దేశంలో, ఏ సినిమా రంగంలో కూడా లేవు, వినపడవు. ఉన్నా ఈ స్థాయిలో మీడియాలో పాపులర్ కావు, కాలేవు. మన దేశంలో మాత్రం హీరోయిన్స్ ని వేధించడం, స్టార్ హీరోలు తమ కోసం వేరే హీరోలను తొక్కడం వంటి విషయాలు ఎక్కువగా మీడియాలో హల్చల్ అవుతూ ఉంటాయి. ఓ హీరో ప్రాణం తీసుకోవడానికి కారణం కూడా అదే అని నాలుగేళ్ల క్రితం సంచలనం అయింది. ఇక మన తెలుగు సినిమాలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందంటూ వార్తలు వస్తూ ఉంటాయి.

అందుకే తెలుగు హీరోయిన్స్ కి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని, తెలుగు అమ్మాయిలు అది తట్టుకోలేక ఇతర భాషలకు వెళ్ళిపోతూ ఉంటారని మాట్లాడుతూ ఉంటారు. తాజాగా ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో యువ హీరోయిన్ అనన్య నాగళ్లను ఓ జర్నలిస్ట్ దీనిపైనే అభ్యంతరకర ప్రశ్నలు అడిగింది. సినిమా పరిశ్రమలో కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు ఉంటాయి కదా, అందుకు సంతకం చేస్తేనే ఎక్కువ రేట్ ఉంటుంది కదా అంటూ మహిళా జర్నలిస్ట్… మరో రంగంలో ఉన్న మహిళను అడగడం ఆశ్చర్యం కలిగించింది.

Also Read : ఒకేసారి ఆరు సినిమాలు.. ప్రభాస్ బర్త్ డే స్పెషల్

దీనికి అనన్య చాలా స్మూత్ గా, స్ట్రాంగ్ గా ఆన్సర్ ఇచ్చింది. మీకు అనుభవం లేకుండా ఎలా డిసైడ్ చేస్తారు అంటూ ఎదురు ప్రశ్నించింది. తనకు ఎప్పుడూ అలాంటిది ఎదురు కాలేదని, రెమ్యునరేషన్ అనేది అలా డిసైడ్ అవుతుందని తాను ఎప్పుడూ వినలేదు, చూడలేదు అని క్లారిటీ ఇచ్చింది. కేవలం ప్రచారం మాత్రమే అంటూ సమాధానం చెప్పింది. ఇక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నపై ఇప్పుడు పలువురు మండిపడుతున్నారు. ఒక మహిళగా… తన ఛానల్ వ్యూస్ కోసం మరో మహిళను అంత దారుణంగా ఎలా ప్రశ్నలు అడుగుతారు అంటూ జర్నలిస్ట్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మీరు ఏ కమిట్మెంట్ ఇచ్చి జర్నలిస్ట్ అయ్యారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్