భారత్ – ఆఫ్ఘనిస్తాన్ మధ్య స్నేహం మరోసారి బలోపేతం కానుందా..? ఉగ్రవాదులుగా ముద్రపడిన తాలీబాన్ లు భారత్ కు దగ్గర కావాడానికి ప్రయత్నిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి విదేశాంగ వర్గాలు. తాజాగా తాలిబాన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి శుక్రవారం న్యూఢిల్లీలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తో భేటీ అయ్యారు. 2021లో అధికారం చేపట్టిన తర్వాత భారత్ – తాలిబన్ల మధ్య జరిగిన మొదటి ఉన్నత స్థాయి దౌత్య భేటీ. ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Also Read : కెప్టెన్ పదవి పై సమాచారం ఉంది.. గిల్ కామెంట్స్..!
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వైదొలిగిన తర్వాత.. తాలీబాన్ లు అధికారం చేపట్టారు. ఆ తర్వాత పలు దేశాలు ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు కొనసాగించలేదు. భారత్ కు అంతర్జాతీయ కారణాలతో ఆఫ్ఘన్ కు దూరంగా ఉంటూ వచ్చింది. ఇక తాజా పరిణామాలు చూస్తే.. ఆఫ్ఘన్ విదేశాంగ శాఖా మంత్రి అమీర్ ఖాన్ మాట్లాడుతూ.. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో సంభవించిన భూకంపం తర్వాత.. భారత్ ముందు స్పందించి తమకు సహాయం చేసింది అన్నారు. ఆఫ్ఘనిస్తాన్.. భారత్ ను సన్నిహిత దేశంగా చూస్తుంది అన్నారు.
Also Read : హరీష్ కొంప ముంచడం ఖాయమే..!
పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజల సంబంధాలను తాము కోరుకుంటున్నామని వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు దేశాల మధ్య ఈ పర్యటన మంచి సంబంధాలను నెలకొల్పోతుందని తెలిపారు. ఇక ఆఫ్ఘనిస్తాన్ ను ఆక్రమించుకోవడానికి ఏ దేశానికి తాము అనుమతి ఇచ్చేది లేదన్నారు. ఇదిలా ఉంచితే, కాబులూ – ఢిల్లీ మధ్య డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసులను తిరిగి ప్రారంభిస్తున్నామని విదేశాంగ మంత్రి జై శంకర్ ప్రకటించారు. అలాగే ఆఫ్ఘన్ రాజధాని కాబూల్ లో భారత ఎంబసీని తిరిగి ప్రారంభిస్తున్నామని తెలిపారు.