Wednesday, February 4, 2026 10:51 AM
Wednesday, February 4, 2026 10:51 AM

భారత్ పై పాక్ దే విజయం.. అమెరికా సంచలన కామెంట్

ఆపరేషన్ సిందూర్ విషయంలో అమెరికా జోక్యం, అక్కడి ప్రభుత్వం చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఆ దేశ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. కాల్పుల విరమణ ఒప్పందంపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా విమర్శలకు వేదికగా మారాయి. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ విరుచుకుపడింది. పాక్ భూభాగంలో పెద్ద ఎత్తున దాడులకు దిగింది. ఆ తర్వాత పాకిస్తాన్ కూడా ప్రతిస్పందించే ప్రయత్నం చేయడం, దాడులకు దిగడం వంటివి జరిగాయి.

Also Read : మళ్ళీ కెప్టెన్ గా రోహిత్..? గిల్ కష్టమే..?

ఆ తర్వాత డోనాల్డ్ ట్రంప్ ప్రకటన చేయడం, కాల్పుల విరమణ చేస్తున్నట్టు భారత్ – పాకిస్తాన్ ప్రకటించడం జరిగాయి. అప్పటి నుంచి పదుల సార్లు ట్రంప్.. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై మాట్లాడారు. తానే బెదిరించా అంటూ వ్యాఖ్యలు చేసారు. ఇప్పుడు ఇదే తరహాలో అమెరికా కాంగ్రెస్ కూడా మాట్లాడింది. ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావిస్తూ.. భారతదేశంపై పాకిస్తాన్ సైనిక విజయం అంటూ అభివర్ణించింది. దీనితో ఒక్కసారిగా రాజకీయ దుమారం రేగింది. చైనా ఆయుధాలను పాక్ సమర్ధవంతంగా వాడినట్లు పేర్కొంది.

Also Read : అక్కడ హిడ్మాపై అభిమానం చూస్తే.. షాక్ అవ్వాల్సిందే..!

మే 7 భారత్ మరియు పాక్ దేశాల మధ్య జరిగిన ఘర్షణలో చైనా పాత్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించిందని తెలిపింది. ఎందుకంటే పాకిస్తాన్ సైన్యం చైనా ఆయుధాలపై ఆధారపడిందని, చైనా నిఘా వ్యవస్థను వాడుకుని దాడులకు దిగిందని తెలిపింది. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడింది. ట్రంప్ ఇప్పటి వరకు 60 సార్లు ఈ ప్రకటనలు చేసారని, భారతీయులను అమెరికా అవమానిస్తుంటే.. ప్రభుత్వం చోద్యం చూస్తుందని మండిపడ్డారు.

సంబంధిత కథనాలు

తాజా కథనాలు

ఇప్పుడు వాళ్లంతా ఏమయ్యారు..?

కూటమి అంటే.. ఒక ఉమ్మడి కుటుంబం...

ఏపీ కేబినేట్ సంచలన...

తిరుమల కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి...

దమ్ముంటే అసెంబ్లీకి రా.....

గత రెండు రోజులుగా తనను ఉద్దేశించి...

బ్రేకింగ్: చంద్రబాబు –...

ఏపీలో ప్రస్తుతం జరుగుతోన్న రాజకీయ పరిణామాలు...

సింఘాల్‌ సరే.. తర్వాత...

తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి...

అందరి బ్రతుకు నాకు...

గతవారం పది రోజుల నుంచి ఏపీలో...

పోల్స్