2024 లో అధికారం కోల్పోయిన తర్వాత సైలెంట్ అయిన వైసీపీ నాయకులు.. ఇప్పుడు మళ్లీ రంగంలోకి దిగారు. తమను ఎవరు ఏం చేయలేరు అనే దిమాలో ఉన్న వైసీపీ నాయకత్వం ఇప్పుడు మళ్లీ మీడియా ముందు హడావుడి చేస్తోంది. పలువురు కీలక నాయకులు ఈ మధ్యకాలంలో పదేపదే రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడమే కాకుండా పోలీసులు తో కూడా గొడవలకు దిగుతున్నారు. 2024 లో అధికారం కోల్పోయిన తర్వాత జోగి రమేష్, ఆర్కే రోజా పెద్దగా మీడియా ముందుకు రాలేదు.
Also Read : సినిమా పరిశ్రమ దారిలోకి వచ్చిందా..?
ముఖ్యంగా జోగి రమేష్ కేసులతో కాస్త ఇబ్బంది పడ్డట్టుగానే కనిపించారు. కానీ ఇప్పుడు మళ్ళీ ఆయన దూకుడు పెంచడమే కాకుండా ప్రభుత్వ పెద్దలపై గతంలో మాదిరిగానే విమర్శలు చేస్తున్నారు. తాజాగా వైసిపి నిర్వహించిన ప్రజా పోరాట కార్యక్రమంలో జోగి రమేష్ చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యపరిచే విధంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును పిచ్చి తుగ్లక్ అంటూ కామెంట్స్ చేశారు జోగి రమేష్. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఆయన కొడుకును అరెస్టు చేసిన తర్వాత కొన్నాళ్లపాటు రమేష్ సైలెంట్ గా ఉన్నారు.
Also Read : చంద్రబాబుపై క్యాడర్ ఫైర్.. ఇదేనా మిజరబుల్ ట్రీట్మెంట్..?
తన ఇంటికి జగన్ పెళ్లికి వెళ్లి వచ్చిన తర్వాత జోగి రమేష్ తీరులో మార్పు వచ్చింది. అటు మాజీ మంత్రి అంబటి రాంబాబు కూడా ఇదే స్థాయిలో కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. తాజాగా ఆయన పోలీసులతో గొడవకు దిగటం దానికి వైసిపి ఎలివేషన్లు ఇవ్వడం జరిగాయి. సోషల్ మీడియాలో కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆయన ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. దమ్ముంటే తమను అరెస్టు చేసుకోవచ్చంటూ ఆయన సవాలు కూడా చేశారు. మొన్నటివరకు విడుదల రజనీ కాస్త హడావిడి చేసి ఇప్పుడు సైలెంట్ అయ్యారు. వీళ్ళందరూ అక్రమాలు చేసినట్లు ఆధారాలు ఉన్నా సరే ప్రభుత్వం ముందుకు వెళ్లకపోవడంతోనే వీళ్ళు మళ్ళీ ధైర్యంగా మాట్లాడుతున్నారని అభిప్రాయపడుతున్నారు జనాలు.