ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి పనుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనే దానిపై ఇంకా క్లారిటీ లేదు జనాలకు. దాదాపు రెండు మూడు నెలల నుంచి అమరావతి పనులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతుంది అనే ప్రచారం జరుగుతుంది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా అమరావతిలో ఉన్న ముళ్ళకంపలను పూర్తిస్థాయిలో తొలగించింది. అలాగే అప్పట్లో అమరావతి నిర్మాణ పనుల కోసం తెప్పించిన సిమెంట్ సహా కొన్ని ఇనుము పరికరాలు పనికిరాకుండా పోవడంతో వాటిని కూడా తొలగించారు.
Also Read : సోషల్ మీడియా పోస్టులకు ఘాటు కౌంటర్లు..!
ఇక పనులు మొదలుపెట్టడమే ఆలస్యం అని భావించారు. అయితే క్రమంగా పనులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతి కోసం 15 వేల కోట్లు కేటాయించింది. ఈ నిధులను ఇచ్చేందుకు ఇప్పటికే ప్రపంచ బ్యాంకుతోపాటుగా ఏషియా డెవలప్మెంట్ బ్యాంకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. అయితే తాజాగా ఎన్నికల కోడ్ అడ్డు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం పనుల విషయంలో వెనక్కు తగ్గింది. వచ్చే నెల 15 నుంచి అమరావతి నిర్మాణం పనులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Also Read : వైసీపీకి మరో షాక్.. పల్నాడు జిల్లా షేకింగ్ న్యూస్
ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యం అవుతుంది. టెండర్లు పిలుచుకోవచ్చని కానీ ఖరారు చేయొద్దని ఎన్నికల కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటివరకు 62 పనులకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. సుమారు 42,000 కోట్ల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. మరో 11 పనులకు త్వరలోనే టెండర్లు వేయనున్నారు. ఇక అమరావతిలో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ సిద్ధమవుతోంది. ఇప్పటికే ఆ బ్యాంకు ప్రతినిధులు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పలుమార్లు సమావేశం అయ్యారు. అటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కూడా రాష్ట్రంలో నిర్మాణాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి.