Friday, September 12, 2025 08:57 PM
Friday, September 12, 2025 08:57 PM
roots

అమరావతి నిర్మాణం అప్పటి వరకు పూర్తి కాదా…?

ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్… దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రానికి మూడు రాజధానులనే ప్రతిపాదన తీసుకువచ్చారు. పరిపాలన, శాసన, న్యాయ రాజధానులంటూ విశాఖ, అమరావతి, కర్నూలు నగరాలను ప్రతిపాదించారు జగన్. అదే సమయంలో అమరావతి ప్రాంతాన్ని స్మశానంతో పోల్చారు సభాపతి మొదలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు… ఏకంగా నాలుగేళ్ల పాటు ఉద్యమాలు చేశారు. అదే సమయంలో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం కూడా చేశారు.

Also Read: సిఆర్డీఏ కమీషనర్ వర్సెస్ నారాయణ… చంద్రబాబు కీలక నిర్ణయం

మూడు రాజధానుల బిల్లు శాసనసభలో ఆమోదం పొందినప్పటికీ… మండలిలో వీగిపోయింది. దీంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన జగన్… ఏకంగా మండలినే రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేశారు. అయితే ప్రభుత్వ నిర్ణయంపై రైతులు, మేధావులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు రాజధానులకు వ్యతిరేకంగా రైతులు న్యాయపోరాటం చేయగా,… మండలి రద్దు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మేధావులు పిటిషన్ వేశారు. ఈ రెండు పిటిషన్‌లలో నాటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏపీ హైకోర్టు తీర్పు వచ్చింది. దీంతో తీవ్ర అక్కసు వెళ్లగక్కిన వైసీపీ నేతలు.. ఏకంగా న్యాయమూర్తుల పైనే విమర్శలు చేశారు. అదే సమయంలో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ… నాటి జగన్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

Also Read: మీవల్లే ఇదంతా.. ఎస్పీలు, డీఎస్పీలపై చంద్రబాబు ఫైర్

అయితే అమరావతి రాజధాని అని ఎన్నికల సమయంలో చంద్రబాబు సహా కూటమి నేతలు ప్రచారం చేశారు. ఇందుకు అనుగుణంగానే ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల ఓటర్లు గంపగుత్తగా కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించారు. ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ జరగనుంది. ఏపీ ఏకైక రాజధాని అమరావతి అంటూ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును వైసీపీ ప్రభుత్వం సుప్రీంలో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది.

Also Read: రజనీ మేడం పాపాలపై.. ప్రభుత్వ పెద్దలను అడ్డం పెట్టుకుని..!

రాజధాని అమరావతిపై ఏపీ హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పునకు ప్రస్తుత ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. అమరావతి ఏకైక రాజధాని అనేది ప్రభుత్వ నిర్ణయమని అఫిడవిట్‌లో స్పష్టం చేసింది. రాబోయే మూడేళ్లలో రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని కూడా ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీంతో గత ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేయనుంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్