సింగపూర్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదానికి గురైన తర్వాత తిరిగి హైదరాబాద్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. సినీ ప్రముఖులతో పాటుగా రాజకీయ ప్రముఖులు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలు కూటమి పార్టీల కార్యకర్తలు అందరూ కూడా మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెట్టారు. పలువురు ప్రముఖులు పవన్ కళ్యాణ్ కు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి అండగా ఉంటామని హామీ ఇచ్చిన సంగతి కూడా విధితమే.
Also Read : మళ్ళీ మొదలైన టీ కాంగ్రెస్ మంత్రి పదవి రచ్చ
ఇక మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి ఆయన సతీమణి సురేఖ విషయం తెలిసిన వెంటనే సింగపూర్ వెళ్లారు. రామ్ చరణ్ కూడా తన షూటింగ్ రద్దు చేసుకుని మార్క్ శంకరును పరామర్శించేందుకు సింగపూర్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే మెగా ఫ్యామిలీలో అల్లు అరవింద్ గాని అల్లు అరవింద్ కుటుంబ సభ్యులు గానీ ఎవరు మార్క్ శంకర్ విషయంలో కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టలేదు. దీనిపై సోషల్ మీడియాలో సైలెంట్ గా పెద్ద రచ్చ జరిగింది. గత కొంతకాలంగా మెగా ఫ్యామిలీలో విభేదాలు తలెత్తినట్లు వార్తలు చూస్తూనే ఉన్నాం. అవి ఇంకా అలాగే కొనసాగుతున్నాయా అనే సంకేతాలు కూడా వచ్చాయి.
Also Read : ఏబీవీ పొలిటికల్ ఎంట్రీ.. జగన్ నెవర్ ఎగైన్..!
అయితే వీటికి తెరదించుతూ అల్లు అర్జున్ తన సతీమణి స్నేహ రెడ్డితో కలిసి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్లారు. పవన్ చిన్న కుమారుడు మార్క్ శంకరును పరామర్శించారు. అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతోనే మార్క్ శంకరును పరామర్శించేందుకు అల్లు అర్జున్ వెళ్లినట్లు సమాచారం. పుష్ప సినిమా తర్వాత అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీకి మధ్య దూరం పెరిగింది. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో కూడా మెగా ఫ్యామిలీ పెద్దల నుంచి పెద్దగా స్పందన లేదు అనే అభిప్రాయాలు కూడా వినిపించాయి. ఏది ఎలా ఉన్నా అల్లు అర్జున్ నేరుగా పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగినట్లు కనపడుతోంది.