Monday, October 27, 2025 07:48 PM
Monday, October 27, 2025 07:48 PM
roots

బన్నీ టార్గెట్ వేరే లెవెల్.. మరీ ఈ రేంజ్ లోనా..?

మనిషి ఆశకు హద్దు ఉండదు అనడానికి సినిమా వాళ్ళ చేష్టలే నిదర్శనం. తమ సినిమాలు రికార్డులు బద్దలు కొట్టాలనే లక్ష్యంతో వాళ్ళు చేయని ప్రయత్నాలు ఉండవు. ఒకప్పుడు వంద రోజులు ఆడితే సినిమా సూపర్, డూపర్ హిట్ అన్నట్టు లెక్క ఉండేది. కాని ఇప్పుడు మాత్రం కనీసం 300 నుంచి 500 కోట్ల వరకు కలెక్షన్లు వస్తేనే సినిమా హిట్ అయినట్టు భావిస్తున్నారు హీరోలు. అందుకోసం భారీ బడ్జెట్ అనే మాటతో సినిమా మొదలుపెట్టి కాంబినేషన్ అనే మాటతో పీక్స్ కు తీసుకుని వెళ్తున్నారు.

Also Read : జగన్ ధైర్యం కంటే సుప్రీం భయమే వైసీపీని డామినేట్ చేస్తుందా..?

ఒకప్పుడు ఈ పిచ్చి బాలీవుడ్ కు మాత్రమె ఉండేది. కాని ఇప్పుడు సౌత్ ఇండియాకు బాగా ఎక్కేసింది. మన సౌత్ హీరోల సినిమాలు కనీసం 500 కోట్లు రావాలని టార్గెట్ పెట్టుకుని సినిమా చేస్తున్నారు. ఓ హీరో అయితే 2 వేల కోట్లు అంటూ టార్గెట్ పెట్టుకున్నాడు. ఇండియన్ సినిమాలో ఇప్పటి వరకు రెండు వేల కోట్లు సాధించింది కేవలం ఒక్కటే సినిమా. ఆ తర్వాత పుష్ప సినిమా 1600 కోట్ల దగ్గర ఆగింది. అది అసలు నచ్చడం లేదు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి.

Also Read : పవన్ సంచలన నిర్ణయం.. రెండు రాష్ట్రాల్లో జనసేన సర్వేలు

అందుకే ఇప్పుడు రెండు వేల కోట్లు రావాల్సిందే అని రంగంలోకి దిగాడు అల్లు అర్జున్. అట్లీ అనే స్టార్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న అల్లు అర్జున్.. ఈ సినిమాలో పెట్టుబడి కూడా పెడుతున్నట్టు టాక్. 500 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమా కనీసం రెండు వేల కోట్లు వసూలు చేయాల్సిందే అని లక్ష్యంగా పెట్టుకుని స్టోరీ రెడీ చేసారట. దంగల్ రికార్డులను బ్రేక్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ఇక ఐకాన్ అనే టైటిల్ కూడా ఈ సినిమా కోసం పరిశీలిస్తోంది సినిమా యూనిట్.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.....

తెలంగాణలో ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక...

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్.....

సౌత్ ఆఫ్రికా తో కీలక వన్డే...

చావులోను ఆగని విష...

సాధారణంగా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మానవత్వంతో...

గట్టిగానే సంక్రాంతి పోటీ.....

సంక్రాంతి పండుగ.. తెలుగు వారికి అతి...

బ్రేకింగ్: పరకామణి కేసులో...

గత కొన్నాళ్లుగా తిరుమలలో పరకామణి వ్యవహారం...

కొత్త జిల్లాలు.. మారనున్న...

ఏపీలో జిల్లాల పునర్‌ విభజన ప్రక్రియ...

పోల్స్