టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విషయంలో సోషల్ మీడియాలో హడావుడి ఇంకా కొనసాగుతూనే ఉంది. పుష్ప సినిమా రిలీజ్ తర్వాత జరిగిన పరిణామాలు.. వీళ్ళిద్దరి మధ్య దూరం పెంచాయని.. సోషల్ మీడియాలో ఏదో ఒక ప్రచారం జరుగుతూనే ఉంటుంది. అల్లు అర్జున్ ఇప్పటికీ సినిమాలు మొదలు పెట్టకపోవడానికి ఆ ప్రభావమే కారణం అనేది కూడా చాలా మందిలో ఉన్న మాట. పుష్ప సినిమా సక్సెస్ ఎంజాయ్ చేయలేక అల్లు అర్జున్ ఇబ్బంది పడటాన్ని.. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఏదో ఒక సందర్భంలో ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై ఆరోపణలు చేస్తూ ఉంటారు.
Also Read : తెలంగాణలో బీజేపీ షాకింగ్ సర్వే.. టార్గెట్ రేవంత్ కాదా..?
ఇలా కాస్త మితిమీరి కామెంట్స్ చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి వీళ్ళిద్దరి వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. గద్దర్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేదిక మీద ఉన్న సమయంలో అల్లు అర్జున్ అవార్డు అందుకున్నాడు. ఇక అక్కడి నుంచి అల్లు అర్జున్ యాటిట్యూడ్ లో కాస్త తేడా కనబడింది. వేగంగా వేదిక మీద నుంచి వెళ్లిపోవడం ముఖ్యమంత్రికి సరిగా అభివాదం చేయకపోవడం సంచలనమయ్యాయి.
Also Read : వారికి పదవులు ఉన్నట్లా.. లేనట్లా..?
దీనిపై ఇప్పుడు డిఫరెంట్ కామెంట్స్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అల్లు అర్జున్ విషయంలో రేవంత్ రెడ్డి చేసింది కరెక్ట్ అని కొంతమంది అంటే.. అల్లుఅర్జున్ ఇగో రేవంత్ రెడ్డి టచ్ చేశారని అందుకే అల్లు అర్జున్ అలా బిహేవ్ చేయడంలో తప్పు లేదని మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. కనీసం ముఖ్యమంత్రి అనే గౌరవం ఇవ్వకపోవడం అల్లు అర్జున్ తప్పని.. అతను ఇంకా పుష్ప సినిమా ప్రభావం నుంచి బయటకు రాలేదని.. వాస్తవ ప్రపంచంలోకి రావాలని మరికొంతమంది సలహాలిస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ వ్యవహారం మరోసారి సోషల్ మీడియాలో వీడియోల రూపంలో హడావుడి అవుతుంది.