Friday, September 12, 2025 05:03 PM
Friday, September 12, 2025 05:03 PM
roots

బన్నీ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కు లైన్ క్లియర్… అప్పటి నుంచే

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు మంచి ఊపు మీద ఉన్నాడు. పుష్ప2 సినిమా గ్రాండ్ సక్సెస్ కావడంతో అల్లు అర్జున్ తర్వాతి ప్రాజెక్టులపై సీరియస్ గానే దృష్టి సారించాడు. ఈ క్రమంలో మాటలు మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమా విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడనే దానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ నవంబర్ నుంచి మొదలవుతుందని… ఆగస్టు సమయానికి పుష్ప సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని గతంలో భావించారు.

Also Read : ఆకట్టుకుంటున్న రానా దగ్గుబాటి షో.. అక్కినేని, దగ్గుబాటి కిడ్స్ సందడి

కానీ పుష్ప 2 సినిమా షూటింగ్ క్రమంగా వాయిదా పడటంతో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాపై క్లారిటీ రాలేదు. అయితే ఇప్పుడు పుష్ప 2 సినిమా సూపర్ హిట్ కావడంతో అల్లు అర్జున్ ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్ అధినేత సూర్యదేవర నాగవంశీ 2025 జనవరి నుంచి త్రివిక్రమ్ కాంబినేషన్లో అల్లు అర్జున్ సినిమా మొదలవుతుందని ఓ ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు దానిపైనే అల్లు అర్జున్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. జనవరిలో ఈ సినిమా మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరికి పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Also Read : వెయ్యి కోట్లు దోచిన పిన్నెల్లి… ఆధారాలు బయటకు

గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. మొదటిసారి త్రివిక్రమ్ పాన్ ఇండియా లెవెల్ లో సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్ తోనే ఈ మూవీ ప్లాన్ చేసారు మేకర్స్. జనవరిలో ఒక వీడియో రిలీజ్ చేసి అక్కడి నుంచి సినిమా షూటింగ్ స్పీడ్ ను పెంచాలని… వేసవి వచ్చే సమయానికి ఇండియాలో షూట్ ఫినిష్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

హైదరాబాద్ నుంచి వైసీపీ...

వచ్చే ఎన్నికలపై ఇప్పటినుంచే ఫోకస్ పెడుతున్న...

ఇదేం ప్రెస్ మీట్...

రాజకీయ నాయకులు మీడియా సమావేశాలు నిర్వహించడం,...

లోకేష్ అదుర్స్.. వార్...

నేపాల్ పరిస్థితుల నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం...

తమిళనాడు పై పవన్...

తమిళనాడు ఎన్నికలను భారతీయ జనతా పార్టీ...

పోల్స్