Friday, August 29, 2025 09:31 PM
Friday, August 29, 2025 09:31 PM
roots

బన్నీ విత్ అట్లి.. స్టోరీ ఇదేనా..?

పుష్ప సీరీస్ తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారింది. అతని సినిమా అంటే పాన్ ఇండియా లెవెల్ లో బజ్ క్రియేట్ అవుతోంది. పుష్ప దెబ్బకు వసూళ్ళ పరంగా కూడా ఇండియాలో ఉన్న ప్రతీ స్టార్ హీరోకు అల్లు అర్జున్ ఛాలెంజ్ చేసాడు. సౌత్ ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్ గా మారిపోయాడు అల్లు అర్జున్. ప్రస్తుతం బన్నీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏంటీ అనే దానిపై చాలా చర్చలు ఉన్నాయి. ఈ టైములో త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడనే వార్తలు వచ్చాయి. ఆ సినిమా మాత్రం ముందుకు వెళ్ళలేదు.

Also Read : సహారా టూ డ్రీం 11.. టీం ఇండియా స్పాన్సర్లను వెంటాడుతున్న కష్టాలు

కానీ వెంటనే తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీ చెప్పిన కథ బన్నీకి బాగా నచ్చేసింది. దీనితో ఆ సినిమాను లైన్ లో పెట్టేసాడు. సినిమాకు సంబంధించి రెండున్నర నిమిషాల వీడియో కూడా రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. హాలీవుడ్ రేంజ్ లో సినిమాను ప్లాన్ చేసిన అట్లి, బన్నీ ఇద్దరూ కలిసి అమెరికా కూడా వెళ్ళారు. నిర్మాత కళానిది మారన్ తో ఇద్దరూ భేటీ అయ్యారు. ఇక అప్పటి నుంచి సినిమా స్టోరీ ఏంటీ అనే దానిపై ఆసక్తి మొదలైంది. ఇక లేటెస్ట్ గా దీనికి సంబంధించి ఓ న్యూస్ వచ్చింది.

Also Read : జగన్ తిరుమలకు రావొద్దు.. వైసీపీలో అంతర్గత తిరుగుబాటు

మాఫియా బ్యాక్ డ్రాప్ లో ఓ డాన్ చుట్టూ ఈ సినిమా స్టోరీ ఉంటుంది. ఈ సినిమాలో బన్నీ పాత్రకు చాలా వెయిట్ ఉంటుంది. సెకండ్ ఆఫ్ పిచ్చి ఎక్కిస్తుంది అంటున్నాయి తమిళ సినిమా వర్గాలు. బ్రదర్ సెంటిమెంట్ తో సెకండ్ ఆఫ్ ప్లాన్ చేసినట్టు టాక్. సినిమా షూట్ ఎక్కువగా దుబాయ్, చెన్నై, మలేషియాలో ఉండే ఛాన్స్ ఉందని టాక్ వినపడుతోంది. సినిమాలో గెస్ట్ రోల్స్ కూడా ప్లాన్ చేసిన అట్లి బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ను ఓ రోల్ కు తీసుకున్నట్టు టాక్ నడుస్తోంది.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

ఒక్కటే రాజధాని.. కానీ.....

ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో...

ఇదేం ప్యాలెస్.. రిషికొండ...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో నిర్మించిన...

ఏ క్షణమైనా పిన్నెల్లి...

వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో మాచర్ల...

మరో అవకాశం ఇచ్చినట్లేనా..?

పావలా కోడికి ముప్పావల మసాలా.. అనేది...

అమరావతికి కేంద్రం గుడ్...

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్...

బండి సంజయ్ కు...

తెలంగాణా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి....

పోల్స్