Saturday, September 13, 2025 01:20 AM
Saturday, September 13, 2025 01:20 AM
roots

ఆ మాజీ అరెస్టు ఖాయమైనట్లే..!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మరో మాజీ మంత్రి అరెస్టు ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే వైసీపీ మాజీలు పలువురు జైలు జీవితం గడిపేశారు. మాజీ ఎంపీలు నందిగాం సురేష్, గోరంట్ల మాధవ్‌తో పాటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్‌ కూడా శ్రీ కృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. వీళ్లతో పాటు మాజీ మంత్రులు పేర్ని నాని, రోజా వంటి ముఖ్య నేతలపై ఇప్పటికే కేసులు నమోదయ్యాయి. పేర్ని నాని కుటుంబ సభ్యులను పోలీసులు విచారించారు కూడా. రోజాకు కూడా నేడో రేపో సమన్లు జారీ చేస్తారనే టాక్ బాగా వినిపిస్తోంది. ఇక తాజాగా మరో మాజీ మంత్రి కూడా అరెస్టు అవుతారనే చర్చ పొలిటికల్ సర్కిల్‌లో జోరుగా నడుస్తోంది. ఇంతకీ ఆ నేత ఎవరో తెలుసా.. చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని. మరో రెండు, మూడు రోజుల్లో రజిని అరెస్టు ఖాయమనే మాట వైసీపీ నేతల్లో ఇప్పుడు గుబులు రేపుతోంది.

Also Read : అంగరంగ వైభవంగా పసుపు పండుగ..!

సైబరాబాద్‌లో చంద్రబాబు నాటిన మొక్కను సార్‌ అంటూ.. టీడీపీ మహానాడు వేదిక మీద పెద్ద పెద్ద మాటలు చెప్పి.. పొలిటికల్‌ స్క్రీన్‌ మీద అడుగు పెట్టిన విడదల రజిని.. అనూహ్యంగా వైసీపీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత అత్యంత సన్నిహిత సంబంధాల కారణంగా జగన్ సర్కార్‌లో రెండేళ్ల పాటు కీలకమైన వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా వ్యవహరించారు కూడా. అధికారంలో ఉన్నప్పుడే రజినీపై లెక్కలేనన్ని ఆరోపణలు. చివరికి సొంత పార్టీ ఎంపీపైనే దాడులకు తెగబడిన చరిత్ర రజినీకి ఉంది. ఐదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు. చిలకలూరిపేటలో చిన్న ఇల్లు అయినా.. షాపింగ్ మాల్ అయినా సరే.. విడదల రజినికి కప్పం కట్టాల్సిందే. అలా ఇవ్వలేదనే కారణంగా చిలకలూరిపేటలోని ఎన్ఆర్‌టీ సెంటర్‌లో హైవే పక్కనే భారీ భవనం నిర్మించేందుకు సిద్ధమైన యజమానిని నానా ఇబ్బందులు పెట్టారు. దీంతో నాకెందుకు వచ్చిన తిప్పలు అని భావించిన యజమాని సగం కట్టి పక్కన పడేశారు. ఇలాంటివి చిలకలూరిపేట నియోజకవర్గంలో లెక్కలేనన్ని ఉన్నాయి.

Also Read : పథకాల అమలు పై ఫుల్ క్లారిటీ..!

చిలకలూరిపేటలో ఓ క్వారీ యజమానిని బెదిరించి మాజీ మంత్రి రజిని 2 కోట్లు తీసుకున్నారని విజిలెన్స్‌ రిపోర్ట్‌ తేల్చింది. గుంటూరు జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ ఐపీఎస్‌ అధికారి జాషువా, రజిని పీఏలు చెరో 10 లక్షలు చొప్పున తీసుకున్నారని రిపోర్టులో స్పష్టమైంది. రెండు కోట్లు ఇస్తారా లేక 50 కోట్ల రూపాయల ఫైన్‌ పడేట్లుగా విజిలెన్స్‌ కేసులు బుక్‌ చేయించాలా అని అప్పటి గుంటూరు జిల్లా విజిలెన్స్‌ ఎస్పీ జాషువా బెదిరించారని నివేదికలో అధికారులు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా యడ్లపాడులోని ఓ స్టోన్‌క్రషర్‌ యజమానులను బెదిరించిన మాజీ మంత్రి విడదల రజిని, ఐపీఎస్‌ అధికారి పల్లె జాషువా రూ.2.20 కోట్లు అక్రమంగా వసూలు చేసినట్లు విజిలెన్స్ నివేదిక స్పష్టం చేసింది. ఇందులో రజిని 2 కోట్లు తీసుకోగా.. జాషువా 10 లక్షలు, రజిని పీఏ 10 లక్షలు తీసుకున్నట్లు నిర్థారించింది. ఇక ఎన్నికల ముందు టికెట్ ఇప్పిస్తా అంటూ మల్లుల రాజేష్ నాయుడు నుంచి సుమారు 6 కోట్లు వసూలు చేసినట్లు ఆయనే ఆరోపించారు. ఈ బాగోతం బయటపడగానే సర్దుకున్న మాజీ మంత్రి రజిని కొంత మొత్తం తిరిగిచ్చినా.. బ్యాలెన్స్ ఇచ్చేది లేదని తెగేసి చెప్పారట.

Also Read : బాబు సర్కార్ కీలక నిర్ణయం.. జగన్‌పై కూడా ఎఫెక్ట్..!

పార్టీ అధికారంలో ఉన్న సమయంలో హల్‌చల్‌ చేసిన మాజీమంత్రి విడదల రజిని తన అవినీతి వ్యవహారాలు బయటపడటంతో రివర్స్ డ్రామా ఆడుతున్నారు. బీసీ మహిళను కూటమి ప్రభుత్వం వేధిస్తోందంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారు. వరుస వివాదాలు చుట్టుముట్టడంతో ఒకదశలో వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరతారనే ప్రచారం కూడా జోరుగా సాగింది. అయితే విజిలెన్స్ రిపోర్టు, అవినీతి ఆరోపణల నేపథ్యంలో అది జరగలేదు. ఇలాంటి సమయంలో పీఏ శ్రీకాంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. శ్రీకాంత్ రెడ్డి అరెస్టు సమయంలో రజినీ చేసిన హంగామా అంతా ఇంతా కాదు. ఒక దశలో చిలకలూరిపేట రూరల్ సీఐ పై దాడికి యత్నించారు రజినీ. అయితే ఇక్కడే అసలు విషయం ఎవరికీ అర్థం కావటం లేదు. విజిలెన్స్ రిపోర్టు ప్రకారం ఏ1 గా రజిని, ఏ2 గా జాషువా, ఏ 3 గా మరిది గోపినాథ్ ఉన్నారు. ఇప్పటికే గోపీనాథ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. జాషువా ముందస్తు బెయిల్ కోసం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులోనే శ్రీకాంత్ రెడ్డిని కూడా అరెస్టు చేశారు పోలీసులు. అయితే ఏ1ను పక్కన పెట్టి మిగిలిన వారిని అరెస్టు చేయడంపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. పోలీసు విచారణలో వీళ్లు ఇచ్చే ఆధారాల ప్రకారం రజినీని అరెస్టు చేస్తారనే ప్రచారం జోరుగా జరుగుతోంది.

Also Read : బాలాజీ గోవిందప్ప రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

తన అరెస్టు ఖాయమని ముందే భావించిన మాజీ మంత్రి విడదల రజినీ.. ఇప్పటి నుంచే సానుభూతి కోసం తెగ ప్రయత్నం చేస్తున్నారు. మీడియా ముందుకు వచ్చి పోలీసులు తనపై దౌర్జన్యం చేశారని ఆరోపించారు. ఓ నిందితుడి కోసం పోలీసులు వస్తే.. అతన్ని అప్పగించకుండా.. రక్షించేందుకు ఎందుకు యత్నించారనే ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పటం లేదు. తాను చేసి అవినీతి బయటకు రావడంతో.. అరెస్టు ఖాయమని తేలడంతో.. బీసీ కార్డు, మహిళా కార్డు వాడేస్తున్నారు రజినీ. అయితే ఎన్ని సానుభూతి డ్రామాలు ఆడినా సరే.. మరో వారంలో రజినీ అరెస్టు ఖాయమంటున్నారు వైసీపీ నేతలు.

సంబంధిత కథనాలు

ADspot_img

తాజా కథనాలు

మళ్ళీ మోడినే పీఎం.....

వే2న్యూస్ సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ లో...

లిక్కర్ కేసులో కీలక...

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తు మరింత...

వారసులు.. ఎవరు అసలు.....

తెలుగు రాష్ట్రాల్లో వారసత్వం చుట్టూనే రాజకీయాలు...

ఒక్కటే రాజధాని.. సజ్జల...

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారంలో ఉన్న...

మెడికల్ కాలేజీల వార్.....

ఏపీలో మెడికల్ కాలేజీల పోరు తారాస్థాయికి...

పోల్స్