నీతులు చెప్పేది ఎదుటి వాళ్లకే తప్ప.. మనం పాటించడానికి కాదన్నట్లుగా ఉంది.. వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని పరిస్థితి. చేసేది అవినీతి… నీతివంతులుగా బిల్డప్‌లు… ఇదేంటని ప్రశ్నిస్తే తమ తప్పు కప్పి పుచ్చుకునేలా వ్యంగ్యాస్త్రాలతో అసలు విషయం నుంచి పక్కదారి పట్టించడంలో పేర్ని నాని పెట్టింది పేరు. అయితే అప్పుడు వైసీపీ అధికారంలో… అవినీతిలో ఎ1గా ఉన్న జగన్ అండదండలు ఉండటంతో అడ్డగోలుగా నోరు పారేసుకున్నారు. అడ్డూ అదుపు లేకుండా అందినకాడికి దోచుకున్నారు. ఇందుకు పేర్ని నానికి సంబంధించిన రెండు గోడౌన్ల నుంచి 185 మెట్రిక్ టన్నుల బియ్యం మాయం కావడమే ఉదాహరణ.
తన గోడౌన్‌లో ఉన్న బియ్యం అమ్మేసుకోవడమే కాక.. అటువైపు పౌరసరఫరాలశాఖ అధికారులు ఎవరూ రాకుండా పేర్ని నాని ఆంక్షలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారులు చేపట్టిన తనిఖీల్లో అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే గోడౌన్లు పేర్ని నాని సతీమణి జయసుధ పేరుతో ఉండటంతో.. ఆమెపై కేసు నమోదు కాగా.. పరారీలో ఉన్నారు. అసలు బియ్యం అమ్మేసుకున్న నాని మాత్రం దర్జాగా తిరుగుతున్నారు. జయసుధ ఆచూకీ కోసం నాలుగు బృందాలను ఏర్పాటు చేసినా.. పోలీసులు పట్టుకోవడం లేదనే విమర్శలున్నాయి. పేర్ని నానికి కొంతమంది పోలీసులు, మరికొంతమంది టీడీపీ నేతలు సహకారం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీని వల్లే.. అతని భార్యను పట్టులేకపోయారని చెప్తున్నారు. ఇదే సమయంలో మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేయగా విచారణ జరిగింది. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ప్రాసిక్యూషన్ జాయింట్ డైరెక్టర్ కోరారు. ఈలోపు జయసుధను అరెస్ట్ చేసే అవకాశం ఉందని, తొందర పాటు చర్యలు తీసుకోవద్దని ఆదేశాలు ఇవ్వాలని జయసుధ తరపు న్యాయవాదులు కోరారు. అలా ఇవ్వలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది.
Also Read : సీతారామాంజనేయులును ఎందుకు అరెస్ట్ చేయలేదు..? హైకోర్ట్ సీరియస్
గోడౌన్‌లలో 185 టన్నుల రేషన్ బియ్యాన్ని మాయం చేశారనే అభియోగాలపై పేర్ని నాని సతీమణి జయసుధపై మచిలీపట్నం తాలుకా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో పోలీసులు అరెస్టు చేయకుండా తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్‌ను తొమ్మిదవ అదనపు జిల్లా కోర్టుకు జిల్లా జడ్జి బదిలీ చేశారు. దీంతో ఈ నెల 16న విచారణ చేపట్టిన న్యాయస్థానం పోలీసుల నుంచి సీడీ ఫైల్ రాకపోవటంతో విచారణను వాయిదా వేసింది.
వారం రోజులుగా పేర్ని నాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. ఆయన కుటుంబ సభ్యుల కోసం బందరు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. నాని సన్నిహితుల కాల్ డేటాను సైతం పోలీసులు పరిశీలిస్తున్నారు. మరోవైపు పీడీఎస్ బియ్యం స్వాహా కేసులో డబ్బులు కట్టి బయటపడేందుకు మాజీ మంత్రి పేర్ని నాని వేసిన ఎత్తులు ఫలించలేదు. ఈ ఘటనలో జరిమానా సుమారు రూ.1.72 కోట్లు చెల్లించినా క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. జిల్లా కోర్టులో పేర్ని జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరుగుతున్న నేపథ్యంలో బియ్యానికి సంబంధించి మొత్తం జరిమానా చెల్లిస్తే కోర్టు నుంచి ఊరట పొందవచ్చన్న ఆలోచనతో పేర్ని నాని పావులు కదిపారు. అయితే అధికారులు మాత్రం జరిమానా చెల్లించినా పేర్ని జయసుధ క్రిమినల్ కేసును ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.