మద్యపానం అనేది ఈ సమాజంలో ఓ సాధారణ విషయంగా మారిపోయింది. ఒకప్పుడు రహస్యంగా సాగిన ఆ వ్యవహారం క్రమంగా బహిరంగంగా మారింది. సిగ్గు పడే వారు సిగ్గు వదిలేసే స్థాయికి తీసుకు వెళ్ళింది మద్యపానం. దాని వలన వచ్చే సమస్యల తీవ్రత మాత్రం మందుబాబులకు అర్ధం కాని పరిస్థితి. కానీ ఆ సమస్యలపై అవగాహన తెచ్చుకుని, మద్యపానానికి దూరం కాకపోతే తీవ్రమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. లివర్ ను తక్కువ అంచనా వేయవద్దని వార్నింగ్ ఇస్తున్నారు.
Also Read : తప్పుడు ప్రచారం ఖాతాలపై గురి.. తొక్కి పట్టి నార తీస్తున్న పోలీసులు
ఆల్కహాల్ తీసుకోవడంతో కాలేయం, నాడీ వ్యవస్థ, హృదయనాళ వ్యవస్థ, జీర్ణశయాంతర వ్యవస్థ, కండరాలు, పునరుత్పత్తి వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక మద్యపానంతో సంబంధం ఉన్న నోరు, ఫారింక్స్, ఆహార పైపు, కాలేయం వంటి అవయవాలు క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుంది. కాలేయంపై ఆల్కహాల్ ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంటుందని.. హెచ్చరిస్తున్నారు. హెపాటిక్ స్టీటోసిస్, హెపటైటిస్ సిర్రోసిస్ వంటి సమస్యలకు ఆల్కాహాల్ కారణంగా మారుతుంది.
ప్రతి రోజూ 80 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ తీసుకోవడం వల్ల తీవ్రమైన కాలేయ నష్టం జరిగే ప్రమాదం ఉంది. 10-20 సంవత్సరాలుగా 160 గ్రాములు లేదా అంతకంటే ఎక్కువ ఇథనాల్ తీసుకోవడం వల్ల కాలేయం తీవ్రంగా దెబ్బ తినే అవకాశం ఉంటుంది. అయితే, దీర్ఘకాలిక మద్యపానం చేసేవారిలో 10-15% మందికి మాత్రమే సిర్రోసిస్ వస్తుంది. మహిళలకు హెపాటిక్ సమస్య ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక మద్యపానం కారణంగా కాలేయం సైజ్ పెరుగుతుంది. అలాగే శరీరంలో కొవ్వు బ్రేక్ అవుతూ ఉంటుంది.
Also Read : 4 రోజుల పాటు ఆ సినిమాకు బ్రేక్..!
దీనితో కాలేయానికి ఎక్కువగా ఆమ్లాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. దీని సాధారణ లక్షణాలు అనారోగ్యం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, జ్వరం, కాలేయ నొప్పి, కామెర్లు వంటి సమస్యలు వస్తాయి. దీని కారణంగా మరణం కూడా అకస్మాత్తుగా సంభవించే అవకాశం ఉంటుంది. నీరసంగా ఉండటం, కండరాల క్షీణత, ఉదర కుహరంలో ద్రవం (అస్సైట్స్), పేగు మార్గంలో రక్తస్రావం, కోమా వరకు దారి తీస్తాయి. కాబట్టి ఆల్కాహాల్ విషయంలో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటున్నారు నిపుణులు.