అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కోర్ట్ కు చేరాయి. పరువు నష్టం కేసు వేసిన నాగార్జున కుటుంబం నేడు కోర్ట్ లో తన వాదనలు వినిపించింది. భార్యా, కుమారులు, మేనకోడలితో కలిసి నాగార్జున కోర్ట్ కి హాజరు అయ్యారు. ఈ కేసులో ఇద్దరు సాక్షులను కూడా కోర్ట్ కి తీసుకుని వెళ్ళారు. మేనకోడలు యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని కోర్ట్ కి తీసుకుని వెళ్ళగా నాగార్జున తెలుగులో తన వాంగ్మూలం న్యాయమూర్తికి వినిపించారు. దేనికోసం పిటిషన్ ఫైల్ చేసారని నాగార్జున ను కోర్టు ప్రశ్నించగా…
“మంత్రి కొండా సురేఖ తన కుటుంబం ఫై అమర్యాద పూర్వక వాఖ్యలు చేసింది. దీని వలన మా కుటుంబ పరువు మర్యాదలకు భంగం వాటిల్లిందని కోర్టు కు స్టేట్ మెంట్ ఇచ్చిన నాగార్జున. మంత్రి నా కొడుకు నాగచైతన్య సమంత విడాకులు ఫై అనుచిత వ్యాఖ్యలు చేసింది. సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా మా కుటుంబం పట్ల ప్రజల ఆధారాభిమానాలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో అనేక అవార్డులు వచ్చాయి. సినిమా రంగం తో పాటు సామజిక సేవా కార్యక్రమాలు సైతం చేస్తున్నాం.
మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వలన అంటూ మంత్రి అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడం వలన మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. మంత్రి కొండా సురేఖ ఫై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అని నాగార్జున తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. ఇక సుప్రియ సాక్ష్యం కూడా రికార్డ్ చేసింది కోర్ట్. ఆమె తన వాంగ్మూలం చదివి వినిపించారు. మంత్రి చేసిన వాఖ్యలు వల్ల నాకు చాలా మంది నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలతో మా కుటుంబం లో మనశ్శాంతి లేకుండా పోయింది.
నాగార్జున వైజాగ్ నుండి హైదరాబాద్ కు తిరిగి వచ్చిన తర్వాత వెళ్లి నాగార్జునను కలిశాను. మంత్రి వ్యాఖ్యలపై కుటుంబమంతా కలిసి చర్చించాము. మంత్రి చేసిన వ్యాఖ్యలను సినిమా పరిశ్రమ మొత్తం ఖండించింది. రాజకీయ నాయకులు సినిమా పరిశ్రమ టార్గెట్ గా చేసుకొని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. అంటూ సుప్రియ తన వాదన వినిపించగా… గురువారానికి విచారణ వాయిదా వేసింది కోర్ట్. రెండో సాక్షి వాంగ్మూలం కూడా ఆ రోజు తీసుకుంటామని తెలిపింది.