భారత క్రికెట్ లో సెలక్షన్ కమిటీ వర్సెస్ హెడ్ కోచ్ గౌతం గంభీర్ గా వివాదం నడుస్తుందా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. ముఖ్యంగా కెఎల్ రాహుల్.. రిషబ్ పంత్ విషయంలో జట్టు యాజమాన్యంలో విభేదాలు మొదలయ్యాయని వార్తలు వస్తున్నాయి. జాతీయ మీడియా కధనాల ప్రకారం కేఎల్ రాహుల్ బ్యాటింగ్ ఆర్డర్ మార్చడానికి సెలక్షన్ కమిటీ అంగీకరించడం లేదని, కేఎల్ రాహుల్ ను టాప్ ఆర్డర్ లోనే పంపాలని… అవసరమైతే శ్రేయస్ అయ్యర్ ను ఐదవ స్థానంలో పంపాలని టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ స్పష్టం చేసినట్లు సమాచారం.
Also Read : బూమ్రా లేడు.. భారం మొత్తం ఆ ఇద్దరిపైనే…!
ఇక రిషబ్ పంత్ ను తుది జట్టులో ఉంచాలని.. అవసరమైతే బౌలింగ్ విభాగంలో మార్పులు చేసుకోవాలని.. స్పిన్నర్లను తగ్గించి పేస్ బౌలర్లను తుదిజట్టులోకి తీసుకోవాలని సూచిస్తున్నట్టు తెలుస్తోంది. అక్షర్ పటేల్ బ్యాటింగ్ ఆర్డర్ కోసం కెల్ రాహుల్ ను ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని.. ఇప్పటికే బోర్డు పెద్దలకు కూడా అగార్కర్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. కేల్ రాహుల్ టాప్ ఆర్డర్ లో కొత్త బంతితో సమర్థవంతంగా రాణించగలిగే సత్తా ఉన్న ఆటగాడు. దీనితో అతన్ని ఇంగ్లాండ్ సిరీస్ లో ఇబ్బంది పెట్టారని, దీని కారణంగానే అతను ఫామ్ కోల్పోతున్నాడని అభిమానులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Also Read : సానుభూతి కోసం జగన్ నయా స్కెచ్
ఆస్ట్రేలియా పర్యటనలో అతనిని మూడు టెస్టుల్లో ఓపెనర్ గా పంపి… తర్వాత రోహిత్ శర్మ కోసం మిడిల్ ఆర్డర్ లో పంపడంతో అతను ఫామ్ కోల్పోయాడు. ఇది ఒక నాణ్యమైన క్రికెటర్ మానసిక పరిస్థితి పై ప్రభావం చూపిస్తోందని, సుదీర్ఘ ఇన్నింగ్స్ లు అడగాలికే సత్తా ఉన్న ఆటగాళ్లను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సింది పోయి ఇలా వ్యవహరించడం కరెక్ట్ కాదని అభిమానులు కూడా కోరుతున్నారు. ఇక శ్రేయస్ అయ్యర్ పై పెట్టిన దృష్టి.. కేఎల్ రాహుల్ పై కూడా పెట్టాలని.. అలాగే మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్ ఉంటే లెఫ్ట్ అండ్ రైట్ కాంబినేషన్ సెట్ అవుతుందని, అక్షర్ పటేల్ కోసం రిషబ్ పంతున్ ఇబ్బంది పెట్టవద్దని గంభీర్ ను కోరుతున్నారు.




