మరోసారి విమాన ప్రయాణం తీవ్ర విషాదం నింపింది. అత్యంత సురక్షితమైన ప్రయాణంగా భావించే విమాన ప్రయాణం.. వరుస విషాదాలు నింపుతూనే ఉంది. 240 మందితో లండన్ బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం.. గుజరాత్ లోని అహ్మదాబాద్ సమీపంలోని మేఘానిలో కుప్ప కూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే విమానం జనావాసాలపై కూలిపోయింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఇక విమాన ప్రమాదం జరిగిన ప్రాంతం మొత్తం మంటలు చెలరేగడంతో మరణాలు పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Also Read : పొగాకు రైతుపై రౌడీమూకల తాండవం..!
సివిల్ ఆస్పత్రి సమీపంలో జనావాసాలపై విమానం కూలిపోయింది. విమానంలో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్న విమానం.. చెట్టును ఢీకొట్టి జనావాసాలపై కూలిపోయింది. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్‌లు, ఫైరింజిన్లు సహాయక చర్యలు చేపట్టాయి. సహాయకచర్యల్లో బీఎస్ఎఫ్ సిబ్బంది సైతం పాల్గొన్నారు. విమానం టేకాఫ్ తర్వాతే నియంత్రణ కోల్పోయి, సివిల్ ఆస్పత్రి సమీపంలోని ప్రాంతంలో కూలిందని జాతీయ మీడియా పేర్కొంది.
Also Read : కొత్త మంత్రులకు స్థానిక నాయకత్వంతో వేధింపులు…?
ప్రాథమిక సమాచారం ప్రకారం, అనేక మంది ప్రాణాలు కోల్పోయారు అనేది తెలుస్తున్నా ఎంత మంది మరణించారు అనేది స్పష్టత లేదు. మృతుల సంఖ్య భారీగానే ఉండే అవకాశం ఉంది. విమానం బయల్దేరే సమయంలో.. రెండు ట్యాంకుల నిండా ఇంధనం నింపడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండవచ్చని భావిస్తున్నారు. అయితే ప్రమాదానికి గల కారణాలు ఏంటీ అనే దానిపై స్పష్టత రావడం లేదు. సాంకేతిక కారణమా లేదంటే వాతావరణ పరిస్తితులా అనేది తెలియరాలేదు. విమానంలోని బ్లాక్ బాక్స్‌ను కనుగొని, ప్రమాద కారణాలను గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.




