ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ పాకిస్తాన్ యుద్ధం ఇప్పుడు తారా స్థాయికి చేరుకుంటుంది. భారత్ కు ఆఫ్ఘన్ దగ్గర కావడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేని పాకిస్తాన్ సైన్యం.. పదే పదే దాడులకు దిగింది. ఏకంగా క్రికెటర్ లను కూడా హతమార్చడం తీవ్ర వివాదాస్పదం అవుతోంది. రెండు దేశాలను విడగొట్టే డ్యూరాండ్ లైన్ వెంబడి ఈ దాడులు తీవ్రమయ్యాయి. పలు ఆఫ్ఘన్ పోస్ట్ లను పాకిస్తాన్ స్వాధీనం చేసుకోగా.. పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకు వెళ్ళిన ఆఫ్ఘన్ సైనికులు పెద్ద ఎత్తున దాడులకు దిగారు.
Also Read : ఏపీ ఎఫెక్ట్.. రంగంలోకి ట్రబుల్ షూటర్..!
ఆఫ్ఘన్ మాజీ పార్లమెంటు సభ్యురాలు మరియం సోలైమంఖిల్ ఆసక్తికర కామెంట్స్ చేసారు. భారత్ కు ఆఫ్ఘన్ దగ్గరైన ప్రతీసారి పాకిస్తాన్ ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించారు. భారత్ తో ఆఫ్ఘన్ ఎప్పుడూ సన్నిహితంగానే ఉందని, అంతర్గత సమస్యలు స్నేహాన్ని ఇబ్బంది పెట్టలేదని, ఇది పాక్ పాలకులకు నచ్చదని ఆమె కామెంట్ చేసారు. ఈ దాడి తమకు ఆశ్చర్యంగా ఏం లేదన్నారు మరియం. భారత్ నుంచి ఆఫ్ఘన్ వరకు, దశాబ్దాలుగా ఐఎస్ఐ, పాకిస్తాన్ సైన్యం చేసిన హింస ఇదేనని ఆమె మండిపడ్డారు.
Also Read : బ్రేకింగ్: ఛీఫ్ సెలెక్టర్ గా రవిశాస్త్రి
కానీ యువ క్రికెటర్ లు, పిల్లలను చంపడం హృదయ విదాకరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ సందర్భంగా పాక్ ఆర్మీ చీఫ్ ఆసిఫ్ మునీర్ ను టార్గెట్ గా చేసుకుని ఆమె ఘాటు కామెంట్స్ చేసారు. పాకిస్తాన్ ఏం నాటిందో అదే ఇప్పుడు ప్రపంచం చూస్తోందని, దశాబ్దాలుగా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నారని మండిపడ్డారు. వారిని ఆయుధాలుగా వాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. మీరు పెట్టిన నిప్పు మీ సొంత ఇంటినే తగలబెట్టడం ఖాయం అని ఆమె పాకిస్తాన్ ను హెచ్చరించారు.